ETV Bharat / city

వార్డు వాలంటీర్​పై వైకాపా నాయకుడి దాడి!

author img

By

Published : Dec 16, 2020, 2:26 PM IST

కాకినాడలో నివాసముంటున్న 7వ వార్డు వాలంటీర్ శ్రీలక్ష్మీ​పై స్థానిక వైకాపా నాయకులు దాడులకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఇంటి వద్దకు వచ్చి వాలంటీర్‌ శ్రీలక్ష్మి... ఆమె భర్తను తీవ్రంగా కొట్టారు.

A local ycp leader was attacked by a female volunteer in Kakinada.
మహిళా వాలంటీర్​పై వైకాపా నాయకుడి దాడి

కాకినాడలో ఓ మహిళా వాలంటీర్‌పై స్థానిక వైకాపా నాయకుడు దాడికి తెగబడ్డాడు. శాంతినగర్‌లో నివాసం ఉంటున్న 7వ వార్డు వాలంటీరు శ్రీలక్ష్మి ఇంటిపై మంగళవారం ఉదయం వైకాపా నాయకులు దాడి చేశారు. వాలంటీర్‌ శ్రీలక్ష్మి... ఆమె భర్తను తీవ్రంగా కొట్టారు. తాము గతంలో తెలుగుదేశం సానుభూతి పరులుగా పని చేశామని..అందువల్లే వైకాపా నాయకుడు బళ్ల సూర్యనారాయణ ప్రోద్బలంతోనే దాడి చేశారని వాలంటీర్‌ శ్రీలక్ష్మి చెబుతున్నారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వాలంటీర్‌ శ్రీలక్ష్మి వేడుకొంటున్నారు.

వార్డు వాలంటీర్​పై వైకాపా నాయకుడి దాడి

ఇదీ చదవండి:

నాసేపల్లిలో వృద్ధునిపై చిరుత పులి దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.