ETV Bharat / city

ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి : తితిదే ఈవో జవహర్ రెడ్డి

author img

By

Published : Apr 14, 2022, 3:27 PM IST

TTD EO on Ontimitta Srirama Kalyanam Arrangments : వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో ఈనెల 15న జరగనున్న శ్రీ కోదండ రామస్వామి కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. శాశ్వత కల్యాణ వేదికపై తొలిసారి జరుగుతున్న సీతారాముల వివాహ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని వివరించారు.

TTD EO Jawahar Reddy
TTD EO Jawahar Reddy

TTD EO on Ontimitta Srirama Kalyanam Arrangments : వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో ఈనెల 15న జరగనున్న శ్రీ కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. రేపు రాత్రి జరిగే స్వామివారి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నందున కల్యాణ వేదిక ఏర్పాట్లను జవహార్ రెడ్డితోపాటు కలెక్టర్ విజయరామరాజు, ఇతర జిల్లా అధికార యంత్రాంగం పరిశీలించారు.

కల్యాణ మండపం ప్రాంగణంలో 53 వేల మంది కూర్చొని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సీఎం కూర్చునే వేదిక, భక్తుల గ్యాలరీలు ఇతర ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ తొలిసారి ఒంటిమిట్ట కల్యాణానికి వస్తున్నందున పటిష్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఒంటిమిట్టకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తితిదే ఈవో వివరించారు.

ఇదీ చదవండి : 15న ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణం.. పాల్గొననున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.