ETV Bharat / city

'జీతాలకు దిక్కులేదు కానీ.. మూడు రాజధానులు నిర్మిస్తారా..!'

author img

By

Published : May 6, 2022, 2:05 PM IST

Tulsi Reddy
తులసి రెడ్డి

Tulsi Reddy: ఉద్యోగులకు జీతాలు ఇచ్చే దిక్కు లేదు కానీ.. సీఎం జగన్‌ మూడు రాజధానులు నిర్మిస్తారట అని.. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరో తేదీ వచ్చినా 60 శాతం మంది ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు అందలేదన్నారు. పదవ తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం... ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో ఉపాధ్యాయులపై కేసులు పెట్టటం సరైంది కాదన్నారు.

Tulsi Reddy: ఉద్యోగులకు జీతాలు ఇచ్చే దిక్కు లేదు గానీ... మూడు రాజధానులు నిర్మిస్తామంటూ సీఎం జగన్​ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. 6వ తేదీ వచ్చినా ఇంకా 60 శాతం మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని.. విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు అందలేదన్నారు. ప్రతి నెల ఇదే తంతు కొనసాగుతోందని విమర్శించారు. ఒకవైపు అప్పులు కొండలా పేరుకుపోతున్నాయని... మరోవైపు ప్రభుత్వ ఆస్తులు తెగనమ్ముతున్నారని మండిపడ్డారు. ఇంకోవైపు పన్నుల బాదుడు, ధరల దంచుడు, ప్రభుత్వ ఖర్చుతో సొంత డబ్బా వాయించుకుంటూ ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Tulsi Reddy: పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించే శక్తి లేక నారాయణ, చైతన్య పాఠశాలలపై నెపం నెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై ఎందుకు కేసులు పెట్టినట్లు? ఎందుకు సస్పెండ్ చేసినట్లని ప్రశ్నించారు. నైతిక విలువలు ఉంటే విద్యాశాఖ మంత్రినీ తొలగించాలని...ధైర్యం లేకపోతే సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు.

తులసి రెడ్డి

"ఆరో తేదీ వచ్చినా 60 శాతం మందికి జీతాలు ఇవ్వలేదు. విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు కూడా అందలేదు. కొండల్లా అప్పులు.. మరోవైపు ప్రభుత్వ ఆస్తుల అమ్ముతున్నారు. పెరిగిన ధరలు, పన్నుల బాదుడు.. ఇదే తంతు కొనసాగుతోంది. పరీక్షల నిర్వహణ కూడా చేయలేకపోతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో సొంత డబ్బా వాయించుకుంటూ.. ప్రకటనలు ఇస్తూ ఖజానా ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉద్యోగులకు సకాలంలో వేతనాలు, పింఛన్లు ఇవ్వాలి" -తులసి రెడ్డి, పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు


ఇదీ చదవండి: TDP fires on YSRCP: రేపిస్టులకు వైకాపా మద్దతు వల్లే రోజుకో అత్యాచారం: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.