ETV Bharat / city

Dasara in Proddatur : ప్రొద్దుటూరులో ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం

author img

By

Published : Oct 7, 2021, 1:49 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వరకూ జరిగే దసరా ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Dasara in Proddatur
ప్రొద్దుటూరులో ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం

ప్రొద్దుటూరులో ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం

దసరా ఉత్సవాల నిర్వహణలో రెండో మైసూరుగా ప్రసిద్ధి చెందిన కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘనంగా దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు ముందు సాగగా 102 కలశాలతో మహిళలు అమ్మవారిని పూజించారు. గుర్రపు నృత్యాలు..కోలాట ప్రదర్శనల మధ్య ఊరేగింపు మొదలయ్యింది. అమ్మవారి ఆలయం నుంచి దర్గా బజార్ వరకూ ప్రదర్శన సాగింది. కేరళ వాయిద్యాలతో పాటు వివిధ వేషధారణలు ఆకట్టుకున్నాయి. దసరా ప్రారంభం కావడంతో ప్రొద్దుటూరులో సందడి నెలకొంది. వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.ఈ నెల 16వరకూ జరిగే దసరా ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి : DUSSEHRA 2021: దసరా సంబరాలు.. అమ్మ మెచ్చే నైవేద్యాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.