Clap Vehicles in Andhra Pradesh: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఇంటింటి నుంచి చెత్త సేకరించేందుకు క్లాప్ కార్యక్రమం కింద ఆటోలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరువేల ఆటోలకు డ్రైవర్లను నియమించారు. ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడిచెత్త, ఇతర ఎలక్ర్టానిక్స్ పరికరాలను వీరు వేర్వేరుగా సేకరించనున్నారు. రెడ్డి ఏజెన్సీ సంస్థ ద్వారా డ్రైవర్లను నియామకం చేపట్టారు. విధుల్లో చేరే ముందు నెలకు పదిన్నర వేల వేతనం ఇస్తామని.. పీఎఫ్ , ఈ.ఎస్.ఐ కోతలు విధించనున్నట్లు తెలిపారు.
''డ్రైవర్గా మమ్మల్ని విధుల్లోకి తీసుకున్నారు. ఆ సమయంలో మా జీతం రూ. పదివేల ఆరువందలు అని తెలిపారు. ప్రతి నెల పీఎఫ్, ఈ.ఎస్.ఐ కట్ అవుతుందని తెలిపారు. ప్రతీ నెల ఒకటో తేదిన రోజు జీతం వస్తుందని తెలిపారు. ప్రభుత్వ సెలవులు వర్తిస్తాయంటూ విధుల్లోకి తీసుకున్నరు. ఇప్పుడు రెండు, మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు''- నాగయ్య డ్రైవర్
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప నగరపాలక సంస్థలో మాత్రం వారం రోజులుగా చెత్త సేకరణ వాహనాలు పార్కింగ్ ప్రదేశానికే పరిమితమయ్యాయి. దసరా పండగ రెండు రోజుల ముందు నుంచి ఇంటింటి చెత్త సేకరణ డ్రైవర్లు నిలిపేశారు. కనీస వేతనం చెల్లించడం లేదని.. దాన్ని పెంచాలని ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే విధుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని డ్రైవర్లు వాపోయారు.
ఇవీ చదవండి: