ETV Bharat / city

Marijuana Seized: గుట్టుగా గంజాయి రవాణా.. పలుచోట్ల పట్టివేత

author img

By

Published : Jul 23, 2021, 5:36 PM IST

cannabis
గంజాయి అక్రమ రవాణా

రాష్ట్రంలోని నెల్లూరు, కడప, అనంతపురం తదితర చోట్ల పోలీసులు తనీఖీలు చేసి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

విశాఖపట్నం నుంచి అక్రమంగా కడపజిల్లాకు గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 260 కిలోల గంజాయిని, నాలుగు వాహనాల్ని, 4సెల్​ఫోన్లను స్వాధీనం చేసున్నారు. పట్టుబడిన ఐదుగురు నిందితుల్లో తాడి రాము, చిటికెల తేజ, కొత్తపల్లి నాగేశ్వరరావు అనే వ్యక్తులు విశాఖపట్నం జిల్లా వాసులు కాగా... సుంకిరెడ్డి రంగారెడ్డి, కావేటి నీలకంటేశ్వర పులివెందులకు చెందిన వారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచి రిమాండుకు తరలించారు.

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కోడికాల వలస గ్రామ కూడలి వద్ద అక్రమంగా తరలిస్తున్న 561 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్ని అరెస్టు చేశారు. గంజాయి విలువ రూ.5.60 లక్షలు ఉంటుందని డీఎస్పీ సుభాష్ తెలిపారు.

నెల్లూరులో..

విశాఖపట్నం నుంచి చెన్నైకి ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి రూపంలో ఉన్న ద్రావణాన్ని ,గంజాయిని నెల్లూరు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సీజ్ చేశారు. ముందస్తు సమాచారంతో నెల్లూరులోని సుబ్బారెడ్డి స్టేడియం వద్ద ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీలు చేశారు. గంజాయి విలువ సుమారు రూ.4.3 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న ప్రవీణ్ రాజ్,హరీష్ రాజ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

అనంతపురం జిల్లాలో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరిని కదిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పేర్లు శోభారాణి బాలప్పగారిపల్లికి చెందిన గంగన్న అని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: విశాఖ ఏజెన్సీలో ... 193 కిలోల గంజాయి పట్టివేత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.