ETV Bharat / city

ఆస్తి పన్ను చెల్లిస్తే.. 5 శాతం రాయితీ

author img

By

Published : May 27, 2020, 9:35 AM IST

ఆస్తిపన్నులో 5 శాతం రాయితీ
ఆస్తిపన్నులో 5 శాతం రాయితీ

గుంటూరు నగర పాలక సంస్థలో పన్ను చెల్లింపులకు ఈనెల 27 నుంచి సర్కిల్ కార్యాలయంలో క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. 2020-21 సంబంధిత ఆస్తి పన్ను ఏక మొత్తంలో చెల్లించినట్లయితే 5 శాతం రాయితీ వస్తుందని కమిషనర్​ పేర్కొన్నారు.

గుంటూరు నగర పాలక సంస్థలో పన్ను చెల్లింపులకు ఈనెల 27నుంచి సర్కిల్ కార్యాలయంలో క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్​ చల్లా అనురాధ వెల్లడించారు. ఈ కౌంటర్ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. 2020-21 ఆస్తి పన్ను మొదటి, రెండో అర్ధ సంవత్సరంతో కలిపి ఏక మొత్తంలో చెల్లించినట్లయితే ఆస్తి పన్నులో 5 శాతం రాయితీ వస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఈ అవకాశాన్ని జూన్ 30 వరకు పొడిగించినట్లు కమిషనర్ వివరించారు.

లాక్​డౌన్​ అమలులో ఉన్నందున గుంటూరులోని ఆర్టీసీ కాలనీలోని 6వ వార్డు, గోరంట్ల మెయిన్ రోడ్లోని 181 వార్డు, నల్ల చెరువులోని 66 వార్డు, గుజ్జనగుండ్లలోని 106 వార్డు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కౌంటర్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసేలా తగిన చర్యలు చేసినట్లు చెప్పారు. క్యాష్ కౌంటర్లలో అవసరమైన సిబ్బంది, కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారాలను ఆదేశించారు.

ఇదీ చూడండి:

'కృష్ణాపై కట్టే ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం జరగదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.