ETV Bharat / city

'వేధింపుల విషయం ముందే చెప్పి ఉంటే.. ఇలా జరిగేది కాదేమో?'

author img

By

Published : Aug 20, 2021, 1:22 PM IST

గుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుంటుంబాన్ని హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేశ్ తదితరులు పరామర్శించారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఇంటి స్థలాన్ని అందజేశారు. రమ్య హత్య ఘటన ఇప్పటికీ కలచివేస్తోందని.. ముందే వేధింపుల విషయాన్ని పోలీసులకు చెప్పి ఉంటే ఈ ఘటన జరిగేది కాదేమో? అని సుచరిత అన్నారు.

home minister sucharita
హోంమంత్రి సుచరిత

గుంటూరులో ఇటీవల దారుణహత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీలు పరామర్శించారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఇంటి స్థలాన్ని హోంమంత్రి వారికి అందజేశారు.

రమ్య హత్య ఘటన ఇప్పటికీ కలచివేస్తోంది. ముందే వేధింపుల విషయాన్ని పోలీసులకు చెప్పి ఉంటే ఈ ఘటన జరిగేది కాదేమో?. ప్రభుత్వం వెంటనే స్పందించి రమ్య కుటుంబాన్ని ఆదుకుంది. మృతురాలు సోదరి మౌనికకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మంది దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు.ఇంకా దిశ యాప్ ను విద్యార్థినులు, మహిళలు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది.కళాశాలల్లో ప్రత్యేకంగా విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నాం. -సుచరిత, హోంమంత్రి

చోద్యం చూశారే తప్ప ఎవరూ ఆపలేదు...

రమ్య హత్య జరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారు చోద్యం చూశారే తప్ప ఎవరూ పట్టించుకోలేదని ఎంపీ నందిగం సురేశ్ ఆసహనం వ్యక్తం చేశారు. నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఈ ఘోరం జరిగేది కాదన్నారు. ఘటనపై ప్రతిపక్ష నేతలు శవ రాజకీయాలు చేశారు.. ప్రజలు అది గమనించారని ఆయన అన్నారు.

ఇదీ చదవండి

RAMYA CASE: పూర్తైన రమ్య హత్య నిందితుడి స్నేహితుల విచారణ

VIVEK YADAV : 'రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.