ETV Bharat / city

చిలకలూరి పేట బైపాస్ కు.. "రైట్ రైట్" చెప్పేదెప్పుడో..?

author img

By

Published : Feb 13, 2022, 8:18 PM IST

Chilakaluripet Bypass Road Works: పట్టణం మీదుగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి..! సమయంతో సంబంధం లేకుండా తీవ్ర రద్దీ..! రోడ్డు ప్రమాదాల కట్టడి కోసం... నెలల కిందటే మొదలైన బైపాస్ రోడ్డు నిర్మాణం..! శివరాత్రిలోపు ఊరట దక్కుతుందని జనం ఆశించినా..స్థలాలు, ఇతర వనరులకు పరిహారం చెల్లింపులో జాప్యం..! ఫలితంగా పనులు ఎటూ కదలట్లేదు..! ఇదీ గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డు నిర్మాణ పరిస్థితి.

Chilakaluripet Bypass Road Works
చిలకలూరి పేట బైపాస్ కు..రైట్ రైట్..చెప్పేదెప్పుడో...

Chilakaluripet Bypass Road Works: పట్టణం మీదుగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి..! సమయంతో సంబంధం లేకుండా తీవ్ర రద్దీ..! రోడ్డు ప్రమాదాల కట్టడి కోసం.. నెలల కిందటే మొదలైన బైపాస్ రోడ్డు నిర్మాణం..! శివరాత్రిలోపు ఊరట దక్కుతుందని జనం ఆశించినా.. స్థలాలు, ఇతర వనరులకు పరిహారం చెల్లింపులో జాప్యం..! ఫలితంగా.. పనులు ఎటూ కదలట్లేదు..! ఇదీ గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డు నిర్మాణ పరిస్థితి.

చిలకలూరి పేట బైపాస్ కు..రైట్ రైట్..చెప్పేదెప్పుడో...

కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి గుంటూరు జిల్లా చిలకలూరిపేట మీదుగా వెళ్తుండటం వల్ల... పట్టణమంతా రద్దీగా ఉంటోంది. 2010లో తాతపూడి నుంచి విజయవాడ వారధి వరకు 6 వరుసల రహదారి నిర్మాణం మొదలైంది. రోడ్డు పక్కనే పట్టణ ప్రాంతాల్లో బైపాస్ రహదారులు నిర్మించారు. ఈ క్రమంలో చిలకలూరిపేటలో పైవంతెన పనులు చేపట్టాలని భావించారు. ఓ ప్రైవేటు సంస్థ పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల 2020లో టెండర్ రద్దయింది. మళ్లీ టెండర్లు పిలిచినా పాత గుత్తేదారుకే పనులు దక్కాయి. గతేడాది జూన్‌ నుంచి నిర్మాణం మందగమనంతో సాగుతోంది.

ఇదీ చదవండి : CPI Narayana on Union Government: కేసీఆర్​లా జగన్ కూడా పోరాడాలి -సీపీఐ నారాయణ

Chennai-Kolkata Highway works: రామచంద్రాపురం నుంచి యడ్లపాడు మండలం తిమ్మాపురం వరకు 16.384 కిలోమీటర్ల మేర 6 వరుసల బైపాస్ రహదారి నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం 518 కోట్ల 24 లక్షల రూపాయలు కేటాయించారు. ప్రస్తుతం రామచంద్రాపురం అడ్డరోడ్డు నుంచి 60 మీటర్ల పొడవు వంతెన పునాది పనులు జరుగుతున్నాయి. బొప్పూడికి వెళ్లేమార్గంలో అండర్‌పాస్ పనులకు సంబంధించి గోడ నిర్మాణం పూర్తయింది. శ్లాబు పనులు నిర్మాణంలో ఉన్నాయి. ఇలా.. కొన్ని పనులు వేగంగా జరుగుతుంటే కొన్నిచోట్ల ఆటంకాలు ఎదురవుతున్నాయి.

నరసరావుపేట వెళ్లేమార్గంలో 40 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి గ్యాస్ గోదాము తొలగించాల్సి ఉంది. కుప్పగంజి వాగుపై 120 మీటర్ల పొడవైన వంతెన నిర్మించాల్సి ఉండగా ఇక్కడ సుబాబుల్ తోట ఉంది. గణపవరం-లింగంగుంట్ల మధ్యలో అండర్‌పాస్ నిర్మాణానికి విద్యుత్ తీగలు ఆటంకంగా ఉన్నాయి. బొప్పూడి పరిధిలో బైపాస్ నిర్మించాల్సిన చోట తాటిచెట్లు, బావులు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి పరిహారం చెల్లించకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. సగం సగం పనులతో ప్రమాదాలకు గురవుతున్నారంటూ... స్థానికులు వాపోతున్నారు. త్వరగా పరిహారం చెల్లించి.. పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : Quarries Pollution in Visakha : క్వారీల్లో తవ్వకాలు.. కాలుష్యం కోరల్లో స్థానికులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.