ETV Bharat / city

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం.. రుణాలపై మార్గదర్శకాలు విడుదల

author img

By

Published : Aug 23, 2020, 12:28 AM IST

Updated : Aug 23, 2020, 12:36 AM IST

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం స్వయం సహాయ సంఘాలకు రుణాలపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 2019 ఏప్రిల్‌ 11 వరకు పెండింగ్‌ బ్యాంకు లింకేజీ రుణాలకు మాత్రమే వర్తించనుంది. 2019, ఏప్రిల్ 11 కంటే ముందు నిరర్థక ఆస్తులుగా ప్రభుత్వం ప్రకటించింది.

YSR Asara Scheme .. Release of Guidelines on Loans
వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం.. రుణాలపై మార్గదర్శకాలు విడుదల

2020-21 ఆర్థిక సంవత్సరానికి వైఎస్​ఆర్ ఆసరా పథకం కింద స్వయం సహాయ సంఘాల బ్యాంకు లింకేజీ రుణాలను 4 విడతల్లో చెల్లించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 2019 ఏప్రిల్ 11 తేదీ వరకు పెండింగ్​లో ఉన్న బ్యాంకు లింకేజీ రుణాలకు మాత్రమే ఈ వైఎస్​ఆర్ ఆసరా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్ 11 , 2019 తేదీ కంటే ముందు నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది. నిలిపి వేసిన ఎస్​హెచ్​జీ ఖాతాలకు ఆసరా పథకం వర్తించదని స్పష్టం చేసింది. స్వయం సహాయ సంఘాలకు ఆసరా పథకం అమలును క్షేత్రస్థాయిలో సెర్ప్, మెప్మా సంస్థలు పర్యవేక్షిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండీ... కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి ఉప కమిటీలు నియమిస్తూ ఆదేశాలు

Last Updated : Aug 23, 2020, 12:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.