ETV Bharat / city

చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఎస్​ఈసీకి అప్పిరెడ్డి ఫిర్యాదు

author img

By

Published : Feb 5, 2021, 9:25 PM IST

మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎస్​ఈసీ నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారని వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ నిమ్మగడ్డను కోరారు. ఏకగ్రీవాలు ఆపాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

lella appireddy complained sec to take action on chandra babu naidu
చంద్రబాబుపై కేసు నమోదు చేయాలంటూ ఎస్​ఈసీని కోరిన లేళ్ల అప్పిరెడ్డి

పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్​ను వైకాపా కోరింది. ఈ మేరకు ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డితో సహా పలువురు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్​ను​ కలిసి ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఫిర్యాదు చేసినా.. నామమాత్రపు చర్యలతో సరిపెట్టారని అప్పిరెడ్డి ఆరోపించారు. తెదేపా మేనిఫెస్టో విడుదలను తాము ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లినా.. చంద్రబాబుపై కేసు నమోదు చేయలేదని విమర్శించారు. ఏకగ్రీవాలు ఆపాలన్న ఎస్​ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి: తెదేపా నేతలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.