ETV Bharat / city

ఈత రాకున్నా మహిళ ప్రాణం రక్షించాడు..!

author img

By

Published : Jun 2, 2020, 6:09 PM IST

ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయింది. అది చూసిన ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఆ మహిళను కాపాడాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోచమ్మ చెరువులో జరిగింది.

telengana news
ఈత రాకున్నా..మహిళ ప్రాణాలు రక్షించాడు

ఈత రాకున్నా ప్రాణాలకు తెగించి ధైర్య సాహసంతో ఓ మహిళ ప్రాణాలు రక్షించాడు. తెలంగాణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోచమ్మ చెరువులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. మహిళ చెరువులోకి దూకే సమయంలో అక్కడే ఉన్న మురళి ఏమి ఆలోచించకుండా చెరువులో దూకాడు. మురళికి ఈత రాదు. బయటే ఉన్న మరో వ్యక్తి అతనికి టవల్​ అందించాడు. టవల్​ను పట్టుకుని మహిళను కాపాడాడు. ఈత రాకున్నా... మహిళ ప్రాణాలు కాపాడిన మురళిని పలువురు అభినందించారు. అయితే మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: స్నేహితుడి ప్రాణాలు బలిగొన్న ప్రేమ వ్యవహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.