ETV Bharat / city

''జగన్ వచ్చారు.. ఇస్తానన్న 18 వేలు ఎప్పుడిస్తారు?''

author img

By

Published : Nov 13, 2019, 11:26 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. తమకు కనీస వేతనం 18 వేలకు పెంచాలని, నామినీలను వీఆర్​ఏలుగా నియమించాలని, పదోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పలు చోట్ల పంచాయతీల్లో పని చేసే ఒప్పంద కార్మికులు, తొలగించిన వీవోఏలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

vros state wide strike at the front of collectorates

రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వీఆర్ఓల ధర్నా

తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్‌ఏలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. అన్ని జిల్లాల కలెక్టరేట్​ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. తమకు కనీస వేతనం రూ.18వేలకు పెంచాలని, పదోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు
ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్​ఏలు ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు. తెల్లరేషన్ కార్డులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వీఆర్​ఏలకు సీఐటీయూ నేతలు సంఘీభావం తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట వీఆర్​ఏలు ధర్నా చేశారు.సమస్యలను పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని అన్నారు.

ఒప్పంద ఉద్యోగులు, వివోఏలు నిరసన

పశ్చిమగోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీ ఒప్పంద ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఏలూరు కలెక్టరేట్ వద్ద వేలాది మంది కార్మికులు ధర్నా చేపట్టారు. తమ వేతనాలను 18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 131, 57, 142జీఓలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే ఇంటి ముందు

విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణ మూర్తి రాజు కన్నబాబు నివాసం ఎదుట డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు. వివోఏల తొలగింపు నిర్ణయం అన్యాయమన్నారు.

ఇదీ చదవండి:

నేటి మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే

Intro:విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో ఎలమంచిలి ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణ మూర్తి రాజు కన్నబాబు నివాసం ఎదుట ఈరోజు డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం వివో ఏ లకు రూ 10 వేల రూపాయలు వేతనాలు ప్రకటించి సీనియర్ నందరిని తొలగించడం అన్యాయమని అన్నారు ఇందుకు నిరసనగా వీరంతా ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నా చేశారు వేతనాలు ప్రకటించి ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న వారిని తొలగించడం అన్యాయం అన్నారు పాతవారిని కొనసాగించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తమకు న్యాయం చేయాలని కోరారు ఎమ్మెల్యే వచ్చి హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించమని స్పష్టం చేశారు ఎలమంచిలి నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల నుంచి వి ఏ ఓ లు అందరూ హాజరయ్యారు వీరికి dakra మహిళలు మద్దతునిచ్చారు


Body:ఓవర్


Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి ఎంప్లాయ్ ఐడి నెంబర్ 10146
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.