ETV Bharat / city

మాతృభాష ప్రతి ఒక్కరి ఇంటిభాష కావాలి: వెంకయ్యనాయుడు

author img

By

Published : Jul 25, 2020, 7:06 AM IST

మాతృభాష, మాతృమూర్తిని మరచిపోకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పిల్లలకు మాతృభాష నేర్పడం ఇంటి నుంచే మొదలుపెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు.

venkaiah
venkaiah

'తెలుగుభాషాభివృద్ధి ఒక ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు ఇందుకోసం ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం లేదు. పిల్లలకు మాతృభాష నేర్పడం తమ ఇంటినుంచే మొదలుపెడితే చాలు' అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్భోదించారు. తానా ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవంలో ఆయన శుక్రవారం రాత్రి దిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కీలకోపన్యాసం చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలకోపన్యాసం

పిల్లలకు తల్లిపాలు ఇచ్చినంత బలం పోతపాలు ఇవ్వవన్నది ఎంత వాస్తవమో అమ్మ భాష ఇచ్చే పరిజ్ఞానం అన్యభాషలు ఇవ్వవన్నది అంతే సత్యం. ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. మాతృభాష, మాతృమూర్తిని మరచిపోకూడదు. అమ్మభాషను ముందు తరాలకు అందించాలనే సదాశయంతో ప్రపంచ సాంస్కృతిక మహోత్సవాలకు శ్రీకారం చుట్టిన తానాకు అభినందనలు. మాతృభాష ప్రతి ఒక్కరి ఇంటిభాష కావాలి - వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

ఏపీ మంత్రి గౌతంరెడ్డి, ఎంపీలు సీఎం రమేష్‌, గల్లాజయదేవ్‌, కృష్ణదేవరాయలు, తెలంగాణ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, ఏపీ అధికారభాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, కేంద్ర సాహిత్య అకా‘మీ కార్యరద్శి కె.శ్రీనివాస్‌, తానా అధ్యక్షుడు జయ్‌ తాళ్లూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి

రాజధాని బిల్లులపై న్యాయ సలహా తీసుకుంటున్న గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.