ETV Bharat / city

TSRTC : మెడికల్‌ అన్‌ఫిట్‌ విభాగంలో.. కుటుంబ సభ్యులకు ఉద్యోగం

author img

By

Published : Aug 10, 2022, 9:32 AM IST

TSRTC
టీఎస్​ఆర్టీసీ

TSRTC News : ఆరోగ్య కారణాలతో ఉద్యోగ విమరణ చేసిన సిబ్బంది కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. మెడికల్ అన్‌ఫిట్ విభాగంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి కుటుంబంలో భార్య లేదా కుమారుల్లో ఒకరికి ఉపాధి కల్పించే ప్రక్రియను దశలవారీగా చేపడతామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

TSRTC News : వైద్య కారణాలతో ఉద్యోగ విరమణ చేసిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. మెడికల్‌ అన్‌ఫిట్‌ విభాగంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి కుటుంబంలోని భార్య లేదా కుమారుల్లో ఒకరికి ఉపాధిని కల్పించే ప్రక్రియను దశలవారీగా చేపట్టనున్నామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

TSRTC Job to Retired Employees Family : విధి నిర్వహణలో జరిగిన ప్రమాదం కారణంగా మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారి కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తరవాత వివిధ వైద్య కారణాలతో ఉద్యోగం నుంచి వైదొలగిన వారి కుటుంబ సభ్యులకు అవకాశమిస్తారు. మూడేళ్లపాటు ఏకమొత్తం చెల్లింపు ప్రాతిపదికన గ్రేడ్‌-2 డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ కానిస్టేబుల్‌, శ్రామిక్‌ పోస్టుల్లో వారిని నియమిస్తారు. మూడేళ్ల సర్వీసు పూర్తి తరవాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్‌ సర్వీసులోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇటీవలే స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్బంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 15న 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఆరోజు రూ.120 ఉన్న టీ-24 టికెట్ ను కేవలం రూ.75లకే అందించాలని నిర్ణయించారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం వెళ్లాలనుకునే భక్తులకు ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రూ.75ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.

ఆగస్టు 15న కిలో బరువు ఉండి 75 కిలోమీటర్ల దూరం వరకు అన్ని కార్గో పార్శిళ్లను ఉచితంగా చేరవేయాలని నిర్ణయించారు. దూర ప్రాంతాలకు రెగ్యులర్​గా ప్రయాణించే 75 మంది ప్రయాణికులకు.. తర్వాత చేసే ప్రయాణానికి సంబంధించిన ఒక ఉచిత టికెట్​ను అందజేస్తామని చెప్పారు. విమానాశ్రయానికి పుష్పక్ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు ఆగస్ట్ 15న 75శాతం ఛార్జీలనే వసూలు చేస్తారు.

ఆగస్టు 18వ తేదీన రక్తదాన శిబిరం నిర్వహించి 7,500 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఈనెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 75 ఏళ్లు దాటిన వృద్దులకు తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో ఉచిత హెల్త్ చెకప్​తో పాటు మందులను అందించనున్నారు. 75 ఏళ్ల లోపు ఉన్న వారికి రూ.750కే హెల్త్ ప్యాకేజీతో పాటు.. మందులపై 75శాతం మందుల కొనుగోలుపై రాయితీ అందించనున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.