ETV Bharat / city

ఆర్టీసీ ఉగాది బంపర్ ఆఫర్..

author img

By

Published : Apr 1, 2022, 7:08 PM IST

tsrtc bus
టీఎస్​ఆర్టీసీ బస్సు

TSRTC Ugadi Offer: వినూత్న కార్యాచరణతో ప్రయాణికులకు చేరువవుతున్న టీఎస్​ఆర్టీసీ.. ఉగాది పండగ సందర్భంగా బంపర్​ ఆఫర్లను ప్రకటించింది. కొత్త ఆలోచలకు శ్రీకారం - సరికొత్త ఆశయాలకు ప్రాకారంగా నిలిచే ఉగాది నాడు మరికొన్ని రాయితీలిచ్చి ప్రయాణికులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది.

TSRTC Ugadi Offer: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ తీపికబురు చెప్పింది. ఉగాది పర్వదినాన ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా మూడు రాయితీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​, ఎండీ సజ్జనార్​ వెల్లడించారు. ఉగాది రోజున 65 ఏళ్లు పైబడిన వయోజనులు.. పల్లెవెలుగు నుంచి గరుడ ప్లస్ వరకు ఏ బస్సుల్లోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఆధార్ లేదా వయస్సు ధృవీకరణ పత్రం ఏదైనా చూపించి బస్సుల్లో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.

ఎంత దూరమైనా రాయితీ..: అలాగే కార్గో, పార్శల్ సర్వీస్​ వినియోగదారులకూ మేలు చేకూర్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 5 కిలోల బరువున్న పార్శిల్స్ బుకింగ్ ఛార్జీలపై 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఆయా ప్రత్యేక రోజుల్లో ఎంత దూరం పంపించే పార్శల్​ అయినా రాయితీ వర్తిస్తుందని తెలిపారు. అంతేకాకుండా విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్​ బస్సుల్లో అప్​ అండ్ డౌన్ టిక్కెట్​పై తిరుగు ప్రయాణంలో 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు చెప్పారు. 20 శాతం రాయితీని 10 రోజుల్లోపు ఎప్పుడైనా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీచూడండి: సుకుమార్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌.. ఫొటో షేర్‌ చేసిన చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.