ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM

author img

By

Published : Jun 16, 2022, 10:43 AM IST

Updated : Jun 16, 2022, 11:50 AM IST

TOP NEWS
ప్రధాన వార్తలు

.

  • No crop holiday: రాష్ట్రంలో పంట విరామం లేదు: పూనం మాలకొండయ్య
    No crop holiday: రాష్ట్రంలో ఎక్కడా పంట విరామం లేదని, గోదావరి, కృష్ణా డెల్టాలకు ముందుగానే నీరు విడుదల చేయడంతో సాగు పనులు మొదలయ్యాయని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. 2022-23 సీజన్‌లో రైతులు మూడు పంటలు వేస్తారని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ACCIDENT: రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
    ACCIDENT: గుంటూరు జిల్లాలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. నంద్యాలలోని రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా పాణ్యం నియెజకవర్గంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • gang rape case : ఆ వీడియో ఎందుకు తీశారు? బయటకెలా వచ్చింది?
    Minor Girl Gang Rape Case Updates : జూబ్లీహిల్స్‌లోని బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు బెంజ్‌ కారులో ప్రయాణించేటప్పుడు బాధితురాలితో వీడియోలు ఎందుకు తీసుకున్నారు? ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి? వైరల్‌గా ఎలా మారాయి? అన్న అంశాలపై పోలీస్‌ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • "పసుపు పచ్చ విప్లవం రావాల్సిన అవసరం ఉంది"
    దేశంలో పసుపు పచ్చ విప్లవం రావాల్సిన అవసరం చాలా ఉందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని.. వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 12 వేలకుపైగా..
    India Covid cases: భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 12,213 మందికి వైరస్​ సోకింది. మరో 11 మంది చనిపోయారు. బుధవారం ఒక్కరోజే 7,624 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కేరళలో కారవాన్‌ టూరిజం.. ఏసీ పడక, అత్యాధునిక హంగులతో..
    Kerala Caravan Tourism: దేవభూమిగా పేరొందిన కేరళ రాష్ట్రం కారవాన్‌ టూరిజం ప్రాజెక్టును విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. 'కారవాన్‌ కేరళ' నినాదం వాటాదారుల దృష్టిని సైతం ఆకర్షిస్తుండటం వల్ల రాష్ట్రంలో వెయ్యికి పైగా కారవాన్‌లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • జిన్‌పింగ్‌ భిన్న పంథా.. 70 ఏళ్లు వచ్చినా నో రిటైర్మెంట్.. మూడోసారీ ఆయనే..
    చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్.. 69 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 68 ఏళ్లు వయసు దాటిన తర్వాత పదవిలో ఉండకూడదన్న నిబంధనకు కళ్లెం వేస్తూ ఆయన.. ఇప్పటికీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మూడోసారీ అధ్యక్షుడిగా కొనసాగడానికి సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..
    Gold Price Today: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,240గా ఉంది. కిలో వెండి ధర రూ. 62,800గా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • బీసీసీఐ నయా ప్లాన్​.. ఇకపై 'వన్​ నేషన్​ టూ టీమ్స్​'గా!
    Teamindia two teams: భవిష్యత్​లో టీమ్​ఇండియా.. పూర్తిస్థాయిలో రెండు జట్లుగా విడిపోయి ఏకకాలంలో రెండు సిరీస్​ల్లో ఆడే విధానాన్ని తీసుకురావడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిపాడు బీసీసీఐ కార్యదర్శి జైషా. త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తామని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'సాయి పల్లవికి జాతీయ పురస్కారం పక్కా!'
    Rana saipallavi virataparvam: ఇకపై ప్రయోగాత్మక సినిమాలు చేయనని, కేవలం అభిమానుల కోసమే చిత్రాలు చేస్తానని అన్నారు హీరో రానా. సాయిపల్లవి లేకపోతే 'విరాటపర్వం' ఉండేది కాదని అన్నారు. ఇక విక్టరీ వెంకటేశ్​ మాట్లాడుతూ.. చిత్రం తీసిన విధానం చాలా బాగుందని, సాయిపల్లవికి జాతీయ పురస్కారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Last Updated :Jun 16, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.