ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM

author img

By

Published : May 18, 2021, 9:00 AM IST

....

top news
ప్రధాన వార్తలు

  • మిలిటరీ ఆస్పత్రికి ఎంపీ రఘురామ.. నేడు పూర్తిస్థాయి వైద్యపరీక్షలు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ మిలిటరీ ఆసుపత్రికి చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు గుంటూరు జిల్లా జైలు నుంచి ప్రత్యేక వాహనంలో ఆయనను రోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌కు తరలించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేడు 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' నిధుల విడుదల

నేడు 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. అర్హుల ఖాతాల్లోకి పదివేల నగదు జమ చేయనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు.. జిల్లాలో 100 మందికి చికిత్స..!

గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్కువ శాతం మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు మక్కువగా ఉండడంతో ప్రభుత్వ రికార్డుల్లోకి అవి రావడం లేదని తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన సోనూసూద్

అవసరం ఏదైనా.. ఎవరికైనా నేనున్నానంటూ స్పందిస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మిత్రుడి విజ్ఞప్తి మేరకు నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సోనూసూద్‌ ముందుకొచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లాక్​డౌన్​తో 'ఉపాధి' పనులకు ఆదరణ

కరోనా రెండో దశ, లాక్​డౌన్​ కారణంగా పల్లెల్లో ఉపాధి హామీ పనులకు డిమాండ్​ పెరిగిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. మేలో ఇప్పటిదాకా 1.85 కోట్ల పల్లె ప్రజలు ఈ పనులను ఉపయోగించుకున్నారని తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పల్లెలపై కొవిడ్‌ పడగ.. వేలల్లో సిబ్బంది కొరత

కరోనా రెండో దశ వ్యాప్తితో పల్లెలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 1.39 రెట్లు అధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా ఎఫెక్ట్- దావోస్ సదస్సు రద్దు

స్విట్జర్లాండ్​లోని దావోస్​లో జరగాల్సిన వార్షిక సదస్సు కొవిడ్​-19 వ్యాప్తి దృష్ట్యా రద్దైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వాహకులు ఈ మేరకు ప్రకటన చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సముద్రంలో అతిపెద్ద కేబుల్​ వ్యవస్థ: జియో

భారత్​ కేంద్రంగా అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గ కేబుల్​ వ్యవస్థలను నిర్మిస్తున్నట్లు టెలికాం ఆపరేటర్​ రిలయన్స్​ జియో తెలిపింది. ఈ ప్రాజెక్టును ప్రపంచ భాగస్వాములు, సముద్రం లోపల కేబుల్​ సరఫరాదారు సబ్​కామ్​తో కలిసి చేస్తున్నట్లు వివరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • త్వరలోనే వాళ్లను అందుకుంటా: ఫెదరర్

నాలుగేళ్లుగా గ్రాండ్​స్లామ్ టైటిల్ గెలవడంలో విఫలమవుతున్నాడు టెన్నిస్ స్టార్ ఫెదరర్. మోకాలి గాయం కారణంగా ఏడాదికి పైగా విరామం తీసుకుని ఇటీవలే కోర్టులో అడుగుపెట్టాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇప్పుడు ఆ జ్ఞాపకం నా దగ్గర లేదు: సోనూసూద్

సోనూసూద్‌ తొలినాళ్లలో ఒక కామిక్‌ షో కోసం పోషించిన 'నాగరాజ్'​ పాత్ర ఈ మధ్య వైరల్‌గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఆ పాత్రలో తనను తాను చూసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించేదని చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.