ETV Bharat / city

UNESCO report: రాష్ట్రంలో 9,160 స్కూళ్లలో.. ఒక్కొక్కరే మాస్టార్లు!

author img

By

Published : Oct 7, 2021, 1:50 PM IST

‘నో టీచర్‌ నో క్లాస్‌... స్టేట్‌ ఆఫ్‌ ది ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ ఫర్‌ ఇండియా-2021’ పేరుతో యునెస్కో ఓ నివేదిక విడుదల చేసింది. అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రానికి ఇంకా 27,398 మంది ఉపాధ్యాయుల అవసరం ఉందని నివేదికలో వెల్లడించింది.

UNESCO report
UNESCO report

ఆంధ్రప్రదేశ్‌లోని 9,160 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నట్లు ‘నో టీచర్‌ నో క్లాస్‌... స్టేట్‌ ఆఫ్‌ ది ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ ఫర్‌ ఇండియా-2021’ పేరుతో యునెస్కో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని ఏకోపాధ్యాయ పాఠశాలలు 91% పాఠశాలలు గ్రామాల్లోనే ఉన్నట్లు తెలిపింది. మొత్తం 63,621 స్కూళ్లలో 14.4% ఇలా ఒకే ఉపాధ్యాయుడితో సాగుతున్నట్లు వెల్లడించింది. అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న రాష్ట్రాల జాబితాలో అరుణాచల్‌ప్రదేశ్‌ (18.22%), గోవా (16.08%), తెలంగాణ (15.71%) రాష్ట్రాల తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.

...
  • రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 8.39%, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10%, మాధ్యమిక పాఠశాలల్లో 8.32%, మాధ్యమికోన్నత పాఠశాలల్లో 2.28% టీచర్ల అర్హతలు ప్రమాణాల కంటే తక్కువ ఉన్నాయి.
  • దక్షిణాదిలో తాగునీటి సౌకర్యం తక్కువ (77%)గా ఉన్న స్కూళ్లు ఏపీలోనే ఉన్నాయి.
  • పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి.
  • ఏపీలోని టీచర్లు వారానికి నాలుగైదు గంటలు బోధనేతర పనులకు కేటాయించాల్సి వస్తోంది.
  • రాష్ట్రంలోని మహిళా టీచర్లు పని ఒత్తిడి కారణంగా పని-జీవితం మధ్య అసమతౌల్యం ఎదుర్కొంటున్నారు. విపరీతమైన పనిభారం, పని చేసేచోట పరిస్థితులు బాగా లేకపోవడం, సుదీర్ఘమైన పనిగంటల కారణంగా టీచర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
  • వాట్సప్‌, రేడియో, టీవీ, రికార్డెడ్‌ పాఠాలు, ప్రింట్‌ మెటీరియల్‌ను అందుబాటులోకి తెచ్చి పిల్లలను ఆన్‌లైన్‌ పాఠాలకు ఆకర్షితులయ్యేలా చేయడంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్ల కంటే మెరుగ్గా ఉన్నాయి.
  • దేశవ్యాప్తంగా టీచర్ల లభ్యత పెరిగినా టీచర్లు-విద్యార్థుల నిష్పత్తి మాధ్యమిక పాఠశాలల్లో ఆశాజనకంగా లేదు. సంగీతం, ఆర్ట్‌, పీఈటీల సమాచారం ఎక్కడా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,10,971 ఉండగా, అందులో 89% గ్రామాల్లోనే ఉన్నాయి.
.....



ఇదీ చదవండి

ntr: అభిమాని కోరిక తీర్చిన యంగ్ టైగర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.