ETV Bharat / city

ఆర్టీసీలోని ఆ కుటుంబాలకు.. ప్రభుత్వం శుభవార్త

author img

By

Published : Feb 18, 2022, 8:51 PM IST

ఏపీఎస్​ ఆర్టీసీలో పని చేస్తూ మెడికల్​ అన్​ఫిట్​ అయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వంలో విలీనం తర్వాత అన్​ఫిట్​ అయిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 2019 డిసెంబర్ 31 వరకు మెడికల్ అన్ ఫిట్ అయిన వారందరికీ ఉద్యోగాలు కాకుండా మోనటరీ బెనిఫిట్స్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎపీఎస్ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు.

apsrtc
ఏపీఎస్​ ఆర్టీసీ

ఏపీఎస్ ఆర్టీసీలో మెడికల్ అన్​ఫిట్ అయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చే విషయమై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో విలీనం తర్వాత మెడికిల్ అన్ ఫిట్ అయిన వారి కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలివ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వంలో విలీనానికి ముందు మెడికల్ అన్ ఫిట్ అయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలివ్వకూడదని నిర్ణయించింది.

2019 డిసెంబర్ 31 వరకు మెడికల్ అన్ ఫిట్ అయిన వారందరికీ ఉద్యోగాలు కాకుండా మోనటరీ బెనిఫిట్స్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. విలీనానికి ముందు పెండింగ్​లో ఉన్న దరఖాస్తు చేసుకున్న వారికి మోనటరీ బెనిఫిట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, అన్ని జిల్లాల ఆర్​ఎంలు ఆ ఆదేశాలు అమలు చేయాలని తెలిపారు.

2020 జనవరి ముందు మెడికల్ అన్​ఫిట్ అయి ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసిన వారికి కొలువులు ఇవ్వకపోవడంపై ఆర్టీసీ ఐక్య వేదిక అభ్యంతరం తెలిపింది. విలీనానికి ముందు కాలంలో మెడికిల్ అన్​ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు సాధ్యం కాదనడం బాధాకరమని ఐక్య వేదిక నేతలు వై.శ్రీనివాసరావు, దామోదర్​రావు ప్రకటనలో తెలిపారు. వారంతా మోనటరీ బెనిఫిట్ మాత్రమే తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు ఇవ్వడం చాలా బాధాకరమని నేతలు తెలిపారు.

ఆర్టీసీలో మెడికిల్ అన్​ఫిట్ అయిన కుటుంబాలను ఆదుకొనేలా సీఎం చొరవ తీసుకోవాలని ఐక్య వేదిక డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ఆదేశాలు ఇప్పించి ఆదుకోవాలని కోరింది. మెడికల్ అన్​ఫిట్ అయిన వారికి ఉద్యోగాలివ్వాలని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదేశాలిచ్చారని.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఐక్య వేదిక డిమాండ్ చేసింది.

ఇదీ చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ఎన్‌టీపీసీ సీఎండీ గురుదీప్‌ సింగ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.