ETV Bharat / city

'నీటి లభ్యతను కచ్చితంగా తేల్చి, నిర్ధరించాకే గోదావరి-కావేరీ అనుసంధానం'

author img

By

Published : Jan 19, 2022, 11:35 PM IST

Godavari-Kaveri connection: జాతీయ జలాభివృద్ధి సంస్థ 69వ పాలకమండలి సమావేశమైంది. కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి అధ్యక్షతన వర్చువల్ వేదికగా సమావేశం జరిగింది. గోదావరి - కావేరీ అనుసంధానానికి సంబంధించి గతంలో చెప్పిన విషయాన్నే తెలంగాణ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది.

Godavari-Kaveri connection
Godavari-Kaveri connection

Godavari-Kaveri connection: నీటి లభ్యతను కచ్చితంగా తేల్చి, నిర్ధరించాకే గోదావరి-కావేరీ అనుసంధానం విషయంలో ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. జాతీయ జలాభివృద్ధి సంస్థ 69వ పాలకమండలి సమావేశమైంది. కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి అధ్యక్షతన వర్చువల్ వేదికగా సమావేశం జరిగింది. రాష్ట్రం తరఫున హైదరాబాద్​లోని జలసౌధ నుంచి తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, అంతర్ రాష్ట్ర వ్యవహారాల సీఈ మోహన్ కుమార్ సమావేశానికి హాజరయ్యారు.

మొదటి నుంచి చెప్పిందే మరోసారి..

గోదావరి - కావేరీ అనుసంధానానికి సంబంధించి గతంలో చెప్పిన విషయాన్నే రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. గోదావరిలో మిగులు జలాలకు సంబంధించి పూర్తి స్పష్టత రావాల్సి ఉందని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించి 274టీఎంసీల నీటిని మూడురాష్ట్రాల్లో ఆయకట్టు, చెన్నై తాగునీటి అవసరాలు తీర్చేలా గోదావరి-కావేరి అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఐతే ఛతీస్‌గఢ్‌, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్రలు వివిధ అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నీటిలభ్యతపై అధ్యయనం చేశాకే ముందుకెళ్లాలని తెలంగాణ మొదటి నుంచి చెబుతోంది. ఇవాళ్టి సమావేశంలోనూ మరోసారి నీటిలభ్యతను తేల్చాలని సర్కారు స్పష్టం చేసింది

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.