ETV Bharat / city

రోడ్డెక్కిన నిరుద్యోగులు.. జాబ్​ క్యాలెండర్​ విడుదల చేయాలని డిమాండ్​

author img

By

Published : Jul 27, 2022, 8:09 PM IST

Telugu yuvatha: ఉద్యోగాల కోసం తెలుగుయువత ఆధ్వర్యంలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. జాబ్‌ క్యాలెండర్ విడుదల చేయకుండా ముఖ్యమంత్రి మోసం చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ప్రభుత్వశాఖల్లో ఖాళీలు భర్తీ చేయకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Telugu yuvatha
రోడ్డెక్కిన నిరుద్యోగులు

రోడ్డెక్కిన నిరుద్యోగులు

Telugu yuvatha: జాబ్ క్యాలెండర్ అమలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుయువత ఆందోళనకు దిగారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తెలుగు యువత టమోటాలు అమ్మి నిరసన తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులకు నమ్మించి.. మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లు పూర్తయిన..ఒకసారి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని మండిపడ్డారు.

నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం వల్ల యువత దిక్కుతోచని స్థితిలో ఉన్నారని.. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెలుగు యువత ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కారు తుడిచి, చెప్పులు కుట్టి, ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే.. పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పాతపట్నంలో అంబేడ్క్‌ర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లిన తెలుగు యువత అక్కడే ధర్నా చేశారు.

"నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం వల్ల యువత దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వల్ల యువత రిక్షా, ఆటోలు నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించుకునే పరిస్ధితికి ముఖ్యమంత్రి తీసుకువచ్చారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే...పోరాటం ఉద్ధృతం చేస్తాం"- నిరుద్యోగులు

కోనసీమ జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో పి.గన్నవరంలో భిక్షాటన నిర్వహించారు. జగన్ పోవాలి జాబు రావాలి అంటూ నినదించారు. తిరుపతిలో ఎస్డీ రోడ్డు నుంచి పశ్చిమ పోలీస్ స్టేషన్ వరకు రిక్షాలు తొక్కుతూ.. నిరసన చేపట్టారు. యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వల్ల యువత రిక్షా, ఆటోలు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే పరిస్ధితికి ముఖ్యమంత్రి తీసుకువచ్చారని విమర్శించారు.

జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ కడప ఏడురోడ్ల కూడలిలో తెలుగుయువత ఆందోళన చేపట్టింది. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తుండగా.. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.