ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా కేసులు... 27 మంది మృతి

author img

By

Published : May 16, 2021, 10:46 PM IST

తెలంగాణలో కొత్తగా మరో 3,816 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది.

corona cases
corona cases

తెలంగాణలో కొత్తగా మరో 3,816 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది. మహమ్మారితో చికిత్స పొందుతూ... మరో 27(మొత్తం 2,955)మంది మృతి చెందారు. రాష్ట్రంలో 44,985 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 658 కరోనా కేసులు నమోదవగా.. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 239, రంగారెడ్డిలో 326, ఖమ్మంలో 151 పాజిటివ్‌లు నిర్ధరణ అయ్యాయి. తాజాగా కరోనా నుంచి 5,892(మొత్తం 4,74,899) మంది కోలుకున్నారు. మరో 50,969 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ కరోనా కేసులు


ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 24,171 కరోనా కేసులు, 101 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.