ETV Bharat / city

వనమా రాఘవకు షరతులతో కూడిన బెయిల్

author img

By

Published : Mar 10, 2022, 7:48 PM IST

Vanama Raghava
వనమా రాఘవకు షరతులతో కూడిన బెయిల్

Vanama Raghava: వనమా రాఘవకు తెలంగాణ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాఘవకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Palvancha Suicide Case: వనమా రాఘవకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతని వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడుతున్నామని రామకృష్ణ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది.

Palvancha Suicide Case: ఆ తర్వాత రాఘవ బాధితులు బయటకు వచ్చారు. అతని ఆగడాలపై చర్యలు తీసుకోవాలంటూ విపక్ష నేతలు ఆందోళనలు నిర్వహించారు. రాఘవపై వచ్చిన ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేస్తూ తెరాస నిర్ణయం తీసుకుంది. అతని లొంగుబాటు వ్యవహారం రకరకాల మలుపులు తిరిగింది. చివరకు రాఘవను పాల్వంచ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. ఆ కేసులో రాఘవకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.