ETV Bharat / city

MAA Election: 'మా' ఎన్నికలపై బండి సంజయ్ కామెంట్స్ ఏంటి? ప్రకాశ్​రాజ్ ఎందుకలా రియాక్ట్ అయ్యారు?:

author img

By

Published : Oct 11, 2021, 1:13 PM IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్​ ఎన్నికల్లో ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay Tweet on MAA Election) అన్నారు. 'మా' ఎన్నికల్లో.. అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు, అతని ప్యానెల్​ సభ్యులకు అభినందనలు తెలిపారు.

BANDI TWEET
BANDI TWEET

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్​ ఎన్నికల్లో ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay Tweet on MAA Election) అన్నారు. 'మా' ఎన్నికల్లో.. అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు, అతని ప్యానెల్​ సభ్యులకు అభినందనలు తెలిపారు. 'జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన 'మా' ఓటర్లకు ధన్యవాదాలు' అంటూ ట్విటర్​లో పోస్ట్ చేశారు. 'దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్​కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం చెప్పారు'అని ట్వీటారు.

  • "మా" అధ్యక్షుడిగా గెలిచిన @iVishnuManchu గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు.
    జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన "మా" ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది.#MaaElections2021

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • "మా" ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. "మా" ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికి అభినందనలు.
    భారత్ మాతాకి జై !#MaaElections2021

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు మా ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రకాశ్ రాజ్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను తెలుగుబిడ్డను కాదన్నందుకే 'మా'ను వీడుతున్నట్లు స్పష్టం చేశారు. బండి సంజయ్ ట్వీట్ గురించి ప్రశ్నించగా.. 'మా'లో రాజకీయాలు ఎంట్రీ ఇచ్చాయని.. అది తనకు నచ్చలేదని అన్నారు. అందుకే అక్కడ ఉండలేక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.