ETV Bharat / city

'ఎందరో మహిళల గురించి విన్నాం... సీతక్కను కళ్లారా చూస్తున్నాం'

author img

By

Published : May 24, 2020, 11:43 AM IST

తెలంగాణ రాష్ట్ర ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క భావితరాలకు మార్గదర్శి అని తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి ట్వీట్ చేశారు. కరోనా కష్ట కాలంలో ఆమె గిరిజన గ్రామాలకు కాలి నడకన వెళ్లి నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

somiredy tweet on mla seethakka
ఎమ్మెల్యే సీతక్క గురించి ట్వీట్ చేసిన సోమిరెడ్డి

somiredy tweet on mla seethakka
సోమిరెడ్డి ట్వీట్

కరోనా కష్టకాలంలో కొండకోనలు దాటి, దారి డొంక లేని గూడేలుకు వెళ్లి నిత్యావసర వస్తువులు అందిస్తున్న సీతక్క సేవలు అద్భుతమని... తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి ట్వీట్ చేశారు.

వలస కూలీలకు అండగా నిలిచిన ఆమె తీరు అనిర్వచనీయమని అన్నారు. వివిధ రంగాల్లో సేవలందించి, చరిత్రలో నిలిచిన మహిళల గురించి విన్నాం.. చదివాం.. సీతక్కను కళ్లారా చూస్తున్నాం అని కితాబునిచ్చారు. భావితరాలకు సీతక్క మార్గదర్శి అని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాళ్లు, గాజు సీసాలతో దాడి చేసుకున్న వైకాపా కార్యకర్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.