ETV Bharat / city

వాస్తవవాదిగా జస్టిస్ ఎన్వీ రమణ.. అందరికీ ఆదర్శం: ఎంపీ కనకమేడల

author img

By

Published : Apr 24, 2021, 8:12 PM IST

నూతన సీజేఐ.. జస్టిస్ ఎన్వీ రమణకు తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర అభినందనలు తెలిపారు. దేశ అత్యున్నత న్యాయపీఠం అధిష్టించిన రెండో తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారని కొనియాడారు. సామాన్యుల హక్కుల పరిరక్షణకు జస్టిస్ ఎన్వీ రమణ విశేష కృషి చేశారన్నారు.

tdp mp kanakamedala
mp kanakamedala wishes to new cji justice nv ramana

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు.. తెదేపా రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అభినందనలు తెలిపారు. పౌరహక్కులు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు జస్టిస్ ఎన్వీ రమణ విశేష కృషి చేశారని గుర్తు చేశారు.

దేశ అత్యున్నత న్యాయపీఠం అధిష్టించిన రెండో తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారన్నారు. దార్శనికునిగా, వాస్తవవాదిగా వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని కనకమేడల ప్రశంసించారు. ప్రాంతీయ భాషలో తీర్పులు ఉండాలని, గ్రామీణ ప్రాంత ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందాలనే ఆకాంక్ష జస్టిస్ ఎన్వీ రమణదేనని అన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ.. మినహాయింపు ఎవరికంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.