ETV Bharat / city

నేడు గవర్నర్​తో తెదేపా బృందం భేటీ

author img

By

Published : Jan 7, 2021, 4:27 AM IST

తెలుగుదేశం నేతల బృందం నేడు గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ను కలవనుంది. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై చర్చించే అవకాశముంది.

ap governor biswabhusan harichandan
ap governor biswabhusan harichandan

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి సంబంధించి తెలుగుదేశం నేతలు నేడు గవర్నర్​ బిశ్వభూషణ్​ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. 130కి పైగా దాడి ఘటనలు జరిగాయని ఆరోపిస్తున్న తెదేపా... వీటన్నింటిపైనా సీబీఐ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్​ను కోరనున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలతో కూడిన బృందం గవర్నర్​తో రాజ్​భవన్​లో భేటీ కానుంది.

ఇదీ చదవండి

జగన్‌ గారూ.. లోపం ఎక్కడ?: పవన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.