ETV Bharat / city

ప్రభుత్వం కులం పేరుతో అధికారులను వేధిస్తోంది: వర్ల రామయ్య

author img

By

Published : Aug 16, 2020, 6:03 PM IST

స్వర్ణ ప్యాలెస్​ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్​ రమేశ్​ బాబుపై వైకాపా నేతలు ఆగ్రహం పెంచుకున్నారని విమర్శించారు. వారి వర్గం నేతలు చేసిన తప్పులను ప్రభుత్వం దాచి పెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వం కులం పేరుతో అధికారులను వేధిస్తోంది: వర్ల రామయ్య
ప్రభుత్వం కులం పేరుతో అధికారులను వేధిస్తోంది: వర్ల రామయ్య

రాష్ట్ర ప్రభుత్వం కులం పేరుతో అధికారులను వేధిస్తోందని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ఇతర వర్గాలపై ఏవైనా ఆరోపణలు వస్తే.. ఉరుకులు పెట్టే ప్రభుత్వం.. వారి వర్గం వారు చేసిన తప్పులను మాత్రం కప్పిపుచ్చుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మందికి ప్రాణాలను కాపాడిన డాక్టర్​ రమేశ్​బాబుపై వైకాపా నేతలు కోపం పెంచుకున్నారని ఆక్షేపించారు.

పది మంది చనిపోవడానికి రమేశ్​ ఒక్కడే కారకుడా అని వర్ల రామయ్య నిలదీశారు. స్వర్ణ ప్యాలెస్​ను ప్రభుత్వం క్వారంటైన్​ కేంద్రంగా వినియోగించి.. రమేశ్​ ఆస్పత్రి యాజమాన్యానికి అప్పగిస్తే.. వారు ఆ భవనాన్ని కొవిడ్​ కేంద్రంగా వినియోగించుకున్నారని గుర్తు చేశారు. విజయవాడలో దాదాపు 15 హోటళ్లను ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించిందని తెలిపారు. తెదేపా నేత అచ్చెన్నాయుడికి చికిత్స చేశారనే రమేశ్ బాబుపై కోపం పెంచుకున్నారని వర్ల మండిపడ్డారు.

ఇదీ చూడండి:

'మాన్సాస్​ను అడ్డుపెట్టుకుని వైకాపా క్షుద్ర రాజ‌కీయాలు చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.