ETV Bharat / city

'బ్రదర్ అనిల్ నేతృత్వంలో చంద్రబాబుపై విష ప్రచారం'

author img

By

Published : Jan 22, 2021, 4:55 PM IST

తెదేపా అధినేత చంద్రబాబుపై జగన్ నాయకత్వంలో కొందరు, బ్రదర్ అనిల్ నేతృత్వంలో ఇంకొందరు విష ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి, బ్రదర్ అనిల్​కు ఉన్న సంబంధమేంటని ఆయన నిలదీశారు.

Jawahar
Jawahar

క్రైస్తవుల ముసుగులో కొందరు.. చంద్రబాబుపై విష ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. జగన్ నాయకత్వంలో కొందరు, బ్రదర్ అనిల్ నేతృత్వంలో ఇంకొందరు ఈ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి, బ్రదర్ అనిల్​కు ఉన్న సంబంధమేంటని జవహర్ నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్​కు కడపలో బ్యాంక్ అకౌంట్ ఎందుకుందని మాజీ మంత్రి ప్రశ్నించారు. క్రైస్తవ్యం ముసుగులో ప్రవీణ్ చక్రవర్తి వంటివారిని అడ్డుపెట్టుకొని బ్రదర్ అనిల్ తన వ్యక్తిగత సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: సీఎం నివాసం ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.