ETV Bharat / city

Encounter At Telangana Chhattisgarh Border : ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

Encounter At Telangana Chhattisgarh Border: తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో కాల్పులు కలకలం సృష్టించాయి. బీజాపూర్​ జిల్లాలో తెలంగాణ గ్రేహైండ్స్​, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

six-maoists-died-in-an-encounter-at-telangana-chhattisgarh-border
ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
author img

By

Published : Dec 27, 2021, 11:20 AM IST

Encounter At Telangana- Chhattisgarh Border : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. సుక్మా జిల్లాలో తెలంగాణ గ్రేహౌండ్స్‌, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Maoists Died At Charla : చర్ల మండలానికి 25 కి.మీ. దూరంలో కుర్ణవల్లి - పెసర్లపాడు అటవీప్రాంతంలో 6 గం. నుంచి 7.30 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఎన్​కౌంటర్​ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు, చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతి చెందినట్లు చెప్పారు.

తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు, ఛత్తీస్​గఢ్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సమయంలోనే ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు. ఎన్​కౌంటర్​లో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, సుక్మా డీఆర్జీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు బస్తర్ పరిధి ఐజీ పి.సుందర్​రాజ్ తెలిపారు. ఆ పరిధిలో 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

మన్యంలో విపరీతంగా పెరిగిన చలి తీవ్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.