ETV Bharat / city

Sitaram Yechury: 'ప్రత్యామ్నాయ ఫ్రంట్.. అప్పుడే ఉంటుంది'

author img

By

Published : Jan 9, 2022, 6:09 PM IST

Sitaram Yechury: భాజపాకు వ్యతిరేకిస్తూనే కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. సీపీఎం జాతీయ కార్యవర్గ ముగింపు సమావేశంలో మాట్లాడిన ఏచూరి... భాజపాపై తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణలోనూ ఎన్నికల సమయానికి తదనుగుణమైన రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత సమయంలో భాజపాకు వ్యతిరేకత భారీగా పెరిగిందన్నారు.

Sitaram Yechury
Sitaram Yechury

Sitaram Yechury: భాజపా ఓటమి లక్ష్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో కృషి చేస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఎన్నికల్లో ఓట్లలో చీలిక లేకుండా కలిసికట్టుగా పనిచేస్తామని వెల్లడించారు. అన్ని విషయాల్లో, రంగాల్లో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారని ఏచూరి విమర్శించారు. సీపీఎం జాతీయ కార్యవర్గ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానితో సహా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. ఫ్రీ అండ్​ ఫెయిర్​ ఎన్నికలు జరగకుండా భాజపా పన్నాగం పన్నుతోందని ఆరోపించారు. ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు కన్నూర్​లో పార్టీ కాంగ్రెస్ జరుగుతుందని ఆయన వెల్లడించారు.

'ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఎన్నికల తర్వాతే ఉంటుంది'

పరిస్థితులకు అనుగుణం నిర్ణయాలు..
భాజపా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీతారాం ఏచూరి మండిపడ్డారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ బద్దంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ చూడాలన్నారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఎన్నికల తర్వాతే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్​లో ప్రధాని వెళ్లాల్సిన సమావేశంలో ప్రజలు రాలేదని ఆయన అన్నారు. ప్రధాని పర్యటనలో సెక్యూరిటీ లాప్స్ ఉంటే సీరియస్ చర్యలు తీసుకోవాలని ఏచూరి పేర్కొన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రాజకీయ వాతావరణం నెలకొందని ఆయన వెల్లడించారు.

కొవిడ్​ను అరికట్టడంలో విఫలం..
ప్రస్తుత సమయంలో భాజపాకు వ్యతిరేకత భారీగా పెరిగిందని సీతారాం ఏచూరి పేర్కొన్నారు. కొవిడ్​ను అరికట్టడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. మరోపక్క ఆర్థిక సంక్షోభం పెరుగుతోందని, ఉపాధి కల్పన లేదని, పెట్రోలియం ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.

పోరాటం కొనసాగుతుంది..

భాజపాపై మా పోరాటం కొనసాగుతుంది. ఈ పోరులో కలిసొచ్చే వారిని కలుపుకుంటాం. ప్రత్యామ్నాయ కూటమి ఎన్నికల తర్వాతే ఏర్పాటు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మా మద్దతు సమాజ్‌వాది పార్టీకి ఉంటుంది. పంజాబ్‌లో పరిణామాలు ఆ రాష్ట్రానికే పరిమితం. పంజాబ్‌ పరిస్థితులు దేశం మొత్తం ఉన్నట్లు కాదు. హెలికాప్టర్ వెళ్లే పరిస్థితి ఉండగా మోదీ కారులో ఎందుకు బయలుదేరారు. ఆరోజు మోదీ సభకు జనం అంతగా రాలేదు. నిజంగా భద్రతా లోపాలను మాత్రం ఎవరూ సహించరు. ఇప్పటికే కొందరు కీలక నేతలను మనం కోల్పోయాం. భద్రతా లోపంతో నేతలను కోల్పోయే పరిస్థితి మళ్లీ రావొద్దు. -సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి

సూటిగా వ్యతిరేకించడం లేదు: తమ్మినేని
భాజపాను వ్యతిరేకిస్తూనే కలిసి వచ్చే వారితో ముందుకెళతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. కేసీఆర్ భాజపాను సూటిగా వ్యతిరేకించడం లేదన్నారు. కొన్ని విషయాల్లో మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. భాజపా సాఫ్ట్ కార్నర్​కు తాము వ్యతిరేకమని తమ్మినేని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కేంద్రం కీలక నిర్ణయం- వారికి మాత్రమే వర్క్​ ఫ్రం హోం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.