ETV Bharat / city

రమేశ్​ ఆస్పత్రికి ఊరట...నోటీసును రద్దు చేసిన హైకోర్టు

author img

By

Published : Sep 3, 2020, 3:31 AM IST

డాక్టర్ రమేశ్ కుమార్​కు హైకోర్టులో ఊరట లభించింది. స్వర్ణ ప్యాలెస్ హోటల్ ప్రమాద ఘటన నేపథ్యంలో ఆసుపత్రి గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది.

Ramesh hospital
Ramesh hospital

స్వర్ణ ప్యాలెస్ హోటల్ ప్రమాద ఘటన నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రి గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది. జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి ఇచ్చిన నోటీసును సవాల్‌ చేస్తూ డాక్టర్ రమేశ్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, డైరెక్టర్ పి.రవికిరణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ నోటీసుల్లో నిర్దిష్టమైన ఆరోపణలు లేవని, సాంకేతిక లోపాలు ఉన్నాయని పిటిషనర్‌ తెలిపారు. అధిక ఫీజు వసూలు చేసినట్లు ఆధారాలు చూపలేదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం....ప్రభుత్వ నోటీసును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి

ఆవిష్కరణ సూచీలో తొలిసారి టాప్​-50లో భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.