ETV Bharat / city

COAL CRISIS: ఆ మూడు నెలలూ బొగ్గు తీసుకోలేదు.. ప్రస్తుత సంక్షోభానికి అదే కారణమా...?

author img

By

Published : Oct 12, 2021, 4:43 AM IST

power shortage in state due to coal crisis
రాష్ట్రంలో బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం

రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్‌ సంక్షోభాని(coal crisis)కి ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు సింగరేణి నుంచి బొగ్గును తీసుకోకపోవడమే కారణమని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. బొగ్గు కొరతను నివారించేందుకు రంగంలోకి దిగిన కేంద్రం..థర్మల్ ప్లాంట్ల దగ్గర ఉన్న బొగ్గు నిల్వల ఆధారంగా సరఫరా చేయాలని ఉత్పత్తి సంస్థలను ఆదేశించింది.

ఈ ఏడాదిలో 3 నెలల పాటు సింగరేణి నుంచి బొగ్గును తీసుకోకపోగా(coal crisis in ap).. జెన్‌కో యూనిట్ల నుంచి వచ్చే యూనిట్ ధర కన్నా బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉండటం(power shortage in state)తో యూనిట్లను బ్యాక్‌డౌన్‌లో ఉంచారు. ఉత్పత్తిలో లేకపోవటంతో అనవసరంగా బొగ్గు నిల్వలు ఎందుకనే కోణంలో అధికారులు ఆలోచించారు. సింగరేణి, మహానది కోల్ ఫీల్డు బకాయిలూ భారీగానే ఉండగా.. బొగ్గు నిల్వలపై అధికారులు దృష్టి సారించలేదు. 2020-21 వేసవిలో వచ్చే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని జెన్‌కో ప్లాంట్ల దగ్గర సుమారు 16 లక్షల టన్నులను నిల్వ చేశారు. లాక్‌డౌన్‌లో డిమాండ్ 130 మిలియన్ యూనిట్లకు పడిపోగా.. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే చౌక విద్యుత్‌ను డిస్కంలు తీసుకున్నాయి. జెన్‌కో ప్లాంట్లను బ్యాక్‌డౌన్ చేయడంతో దాదాపు ఏడాదిగా అక్కడ ఉన్న బొగ్గు వృథాగా పడి ఉంది. దాంతో సింగరేణి నుంచి మూడు నెలల పాటు బొగ్గును తీసుకోలేదు.

రంగంలోకి కేంద్రం...

గత కొంతకాలంగా విద్యుత్‌కు ఊహించని విధంగా డిమాండ్ పెరిగింది. బొగ్గు కొరత కారణంగా దాదాపు 50 శాతం యూనిట్లను మూసేయాల్సి వచ్చిందని ఒక అధికారి తెలిపారు. మరోవైపు ఆయా ఉత్పత్తి సంస్థలకు 600 కోట్ల వరకు జెన్‌కో బకాయి పడి ఉంది. ప్రస్తుతం రంగంలోకి దిగిన కేంద్రం.. బకాయిలతో సంబంధం లేకుండా థర్మల్ ప్లాంట్ల దగ్గర ఉన్న బొగ్గు నిల్వల ఆధారంగా సరఫరా చేయాలని ఉత్పత్తి సంస్థలను ఆదేశించింది. 15 రోజుల వరకు బొగ్గు నిల్వ ఉన్న వాటికి సరఫరా నిలిపివేసి 5-10 రోజులు ఉన్నవాటికి ఉత్పత్తికి అనుగుణంగా, 5 రోజుల కన్నా తక్కువ నిల్వలు ఉన్నవాటికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో నాలుగైదు రోజుల్లో దఫాలవారీగా సుమారు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు రాష్ట్రానికి రానుంది.

మరో 72 వేల టన్నుల రాక..

విజయవాడలోని వీటీపీఎస్​(VTPS), కడపలోని(ఆర్టీపీపీ)RTPP, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 5 రోజుల కంటే తక్కువ నిల్వలు ఉన్నాయి. ప్రాధాన్యత ప్రకారం ఆయా ప్లాంట్లకు ఎక్కువ బొగ్గును ఉత్పత్తి సంస్థలు పంపుతున్నాయి. నిల్వలు పెరిగితే ఉత్పత్తి నిలిపివేసిన 800 మెగావాట్ల ప్లాంటును వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వీటీపీఎస్​లో 30వేల272, ఆర్టీపీపీలో 66వేల525, కృష్ణపట్నంలో 67వేల515 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. వీటీపీఎస్​కు సింగరేణి, మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి 15 రేక్‌లను పంపుతున్నారు. ప్లాంటులోని నిల్వలు ఒక్క రోజుకు మాత్రమే సరిపోయే పరిస్థితి ఉంది. ప్రతి రోజూ కనీసం నాలుగు రేక్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఆర్టీపీపీకి 7 రేక్‌లు మార్గంమధ్యలో ఉన్నాయి. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ అవసరాలకు 73 వేల టన్నుల బొగ్గు కృష్ణపట్నం ఓడరేవుకు సోమవారం చేరింది. ఒడిశాలోని పారదీప్ ఓడరేవులో లోడింగ్‌లో ఉన్న మరో 72 వేల టన్నులు వారంలో రానున్నాయి.

ఇదీ చదవండి..

ఐటీ ఆఫీసర్​లా వచ్చి రూ.40లక్షలు దోపిడీ.. నిమిషాల్లోనే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.