ETV Bharat / city

Modi appreciates 'AP weather Man': తిరుపతి యువకుడికి ప్రధాని ప్రశంస.. ఎందుకో తెలుసా?

author img

By

Published : Jul 26, 2021, 7:55 AM IST

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం చేసిన ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగంలో... ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన యువ ఔత్సాహిక వాతావరణవేత్త సాయిప్రణీత్‌ని అభినందించారు. ఎందుకో మీరూ తెలుసుకోండి.

pm-modi-wishes
pm-modi-wishes

మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రసంగం

తిరుపతికి చెందిన యువ ఔత్సాహిక వాతావరణవేత్త సాయి ప్రణీత్...​ ప్రధాని మోదీ నుంచి అభినందనలు అందుకున్నారు. సాయి ప్రణీత్ గురించి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని విశేషంగా ప్రస్తావించారు.

‘‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన ఈ యువకుడు... వాతావరణంలో వచ్చిన విపరీతమైన మార్పుల కారణంగా తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోవడం చూసి ఆవేదనకు లోనయ్యారు. వాతావరణ శాస్త్రం పట్ల ఎప్పటినుంచో ఆసక్తి ఉన్న సాయి ప్రణీత్‌ దాన్ని రైతుల ప్రయోజనాలకోసం ఉపయోగించాలని భావించి ఒక సరికొత్త పంథాలో నడిచారు. వాతావరణ డేటాను సేకరించి, విశ్లేషించి విభిన్న మీడియా వేదికల ద్వారా రైతులకు స్థానిక భాషలో వాతావరణ సమాచారం అందించడం మొదలుపెట్టారు. ఒకవైపు ఎప్పటికప్పుడు ఈ సమాచారం చెబుతూనే విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఏం చేయాలన్నదానిపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వరదలను ఎలా అధిగమించాలి, పిడుగుల నుంచి ఎలా తప్పించుకోవాలి? అన్న విషయాలను కూడా చెబుతున్నారు’’ అని ప్రధాని పేర్కొన్నారు.

ఇతని సేవలు దేశానికి ఎంతో అవసరమని కొనియాడారు. ‘ఏపీ వెదర్‌ మ్యాన్‌’ పేరుతో వాతావరణ సమాచారాన్ని రైతులకు ఏడేళ్లుగా ఈ యువకుడు అందిస్తున్నారు. సాయిప్రణీత్‌ సేవలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని గుర్తించి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు.

ఇదీ చదవండి:

Rains effect on AP: భారీ వర్షాలకు.. నారుమళ్లు, పైర్లు మునక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.