ETV Bharat / city

పవన్ ప్రకృతి వ్యవసాయం 'చారెడు నేల–బతుకు బాట'

author img

By

Published : Sep 5, 2020, 9:50 PM IST

వ్యవసాయం అంటే కనీసం అరెకరం ఉండాలి అనుకుంటూ ఉంటాం.. అలా కాకుండా కొద్దిపాటి జాగాలో సాగు చేసి ఆదాయం పొందే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించబోతున్నాం అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తెలిపారు. కరోనా విపత్తు వల్ల నగరాల్లో ఉపాధి కోసం వచ్చిన కార్మికులు, చిరుద్యోగులు స్వస్థలాలకు వెళ్ళిపోయారని.. అలాంటివారు సొంత ఊళ్లోనే ఉపాధి పొందేందుకు అవకాశం ఉన్న సాగు విధానం నమూనాలు రూపొందిస్తున్నాం అని తెలిపారు.

pawan kalyan
pawan kalyan

ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కొద్దిపాటి జాగాలో సాగు చేసి ఆదాయం పొందే కార్యక్రమాన్ని చేపడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రకృతి రైతు విజయరామ్ సలహా సహకారాలతో తన వ్యవసాయ క్షేత్రంలో పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మనకు విజ్ఞానాన్ని, చదువు, సంస్కారాన్ని అందించిన గురుదేవుళ్ళను సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా స్మరించుకొంటూ వ్యవసాయ విజ్ఞాన విషయాలను పంచే కార్యక్రమాన్ని చేపట్టామని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా యువతకు, రైతులకు ప్రకృతి వ్యవసాయాన్ని.. అదీ చిన్నపాటి భూమిలో సాగు చేయడం గురించి తెలియచేస్తామని వివరించారు. 250 గజాల్లో 81 మొక్కలు... ఒక క్రమ విధానంలో నాటి.. సాగు చేయడం ద్వారా ఏ విధంగా ఫల సాయం పొందవచ్చో తెలియచేస్తామన్నారు. ప్రకృతి రైతు విజయరామ్​తో తనకు గత 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉందన్నారు. వారు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాలు అనుసరిస్తూ ఉంటారన్న పవన్... విజయరామ్ సలహాలు ప్రకారం కొన్ని నమూనాలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.

చారెడు నేల – బతుకు బాట అనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఉంటుంది. పరిమిత విస్తీర్ణంలో ఎలా సేద్యం చేయాలి అనేదానిపై ఒక ప్రణాళిక మేరకు నిర్దేశిత డైరీతో అవగాహన కల్పిస్తాం. ప్రతి కుటుంబం కలసి పని చేసుకొని ఆదాయం పొందే విధంగా ఈ తరహా వ్యవసాయ విధానం ఉంటుంది. 81 మొక్కల్లో ఏవేవీ ఉండాలి.. వాటికి నీటి వసతి ఎలా సమకూర్చాలి, అందుకు అనుసరించాల్సిన పద్ధతులను సమగ్రంగా తెలియచేస్తాం. ప్రయోగాత్మకంగా నా వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఔత్సాహికులకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తాం- జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఇదీ చదవండి:
టీకా​ కోసం 2021 ద్వితీయార్థం వరకు ఆగాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.