ETV Bharat / city

ap corona cases : తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా 122 మందికి పాజిటివ్

author img

By

Published : Mar 3, 2022, 8:26 PM IST

corona cases
corona cases

ap corona cases : గత 24 గంటల్లో రాష్ట్రంలో 122 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మరో 236 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్​ను విడుదల చేసింది.

ap corona cases : రాష్ట్రంలో గత 24 గంటల్లో 13,460 సాంపిల్స్​ను పరీక్షించగా 122 మందికి కొవిడ్​ సోకినట్లు గుర్తించారు. కొత్తగా 236 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్​ను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,534 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Corona cases in India: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 6,561 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 14,947 మంది కోలుకోగా.. 142 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 77,152గా ఉంది.

  • మొత్తం కేసులు: 42,938,599
  • మొత్తం మరణాలు: 5,14,388
  • యాక్టివ్​ కేసులు: 77,152
  • కోలుకున్నవారు: 4,23,53,620

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బుధవారం మరో 21,83,976 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,78,02,63,222కు చేరింది.

World Corona cases:

ప్రపంచవ్యాప్తంగా 15,78,230 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,402,74,905కు చేరింది. కొత్తగా 7733 మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 5,992,271కు చేరుకుంది. మరోవైపు కోలుకున్న వారి సంఖ్య 19,07,368గా ఉంది.

  • జర్మనీలో కొత్తగా 1,98,457 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 255 మంది కరోనాకు బలయ్యారు.
  • అమెరికాలో కొత్తగా 49,729 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 1,778 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో తాజాగా 97,455 కరోనా కేసులు నమోదయ్యాయి. 784 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 30,995 మందికి వైరస్​ సోకగా.. 335 మంది మృతిచెందారు.
  • ఫ్రాన్స్​లో 57697 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి ధాటికి మరో 186 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: Covid Cases in India: దేశంలో 7వేల దిగువకు కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.