-
ఉత్తరకొరియా నియంత కిమ్‌ని మించిపోయాడు జగన్. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తనకి తానే ప్రకటించుకున్నానని, రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిని అనుకుంటున్నారేమో!(1/3) pic.twitter.com/Rd7qvSIs2M
— Lokesh Nara (@naralokesh) July 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఉత్తరకొరియా నియంత కిమ్‌ని మించిపోయాడు జగన్. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తనకి తానే ప్రకటించుకున్నానని, రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిని అనుకుంటున్నారేమో!(1/3) pic.twitter.com/Rd7qvSIs2M
— Lokesh Nara (@naralokesh) July 11, 2022ఉత్తరకొరియా నియంత కిమ్‌ని మించిపోయాడు జగన్. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తనకి తానే ప్రకటించుకున్నానని, రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిని అనుకుంటున్నారేమో!(1/3) pic.twitter.com/Rd7qvSIs2M
— Lokesh Nara (@naralokesh) July 11, 2022
సీఎం జగన్.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ని మించిపోయారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైకాపాకు జీవితకాల అధ్యక్షుడిగా తనకి తానే ప్రకటించుకున్న జగన్.. రాష్ట్రానికి కూడా జీవితకాల ముఖ్యమంత్రిని అనుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. వైకాపా డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టురట్టు చేశారనే అక్కసుతో.. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ తొలగించేశారని మండిపడ్డారు.
ఇప్పటికే జగన్‌రెడ్డి ఆర్థిక ఉగ్రవాదాన్ని గణాంకాలతో సహా వెల్లడించిన కేశవ్.. తనకు అదనపు భద్రత కావాలని ప్రభుత్వాన్ని కోరితే ఉన్న సెక్యూరిటీ తొలగించేశారని దుయ్యబట్టారు. ఈ కక్ష సాధింపులతో వైకాపా సర్కారు వేలకోట్ల మాయం, ఫోన్ల ట్యాపింగ్ నిజమేనని ఒప్పుకున్నట్టే అని విమర్శించారు. తక్షణమే కేశవ్‌కు అదనపు గన్‌మెన్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అమర్‌నాథ్ వరదల్లో.. ఆంధ్రావాసి దుర్మరణం!