ETV Bharat / city

Taneti Vanitha: ప్రతిపక్షాలు 'దిశ'కు మద్దతివ్వాలి: మంత్రి తానేటి వనిత

author img

By

Published : Sep 15, 2021, 7:44 PM IST

minister taneti vanitha
మంత్రి తానేటి వనిత

దిశ బిల్లు చట్టానికి చెందిన కాగితాలు చింపేసిన తెదేపా నేత నారా లోకేశ్​ చట్టాన్ని అవమానించినట్లేనని.. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. దిశా చట్టాన్ని అపహాస్యం చేయవద్దని ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేశారు.

దిశ బిల్లుకు మద్దతుగా నిలవాల్సిన ప్రతిపక్షం.. అవమానిస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. దిశా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ యాప్ ద్వారా చాలామంది మహిళలకు సాయం అందుతోందన్నారు. ఇటీవల కడప నుంచి దిల్లీకి పరీక్ష రాసే నిమిత్తం వెళ్లిన ఓ యువతి కూడా దిశ యాప్ ద్వారా ఏపీ పోలీసులను సంప్రదించినట్లు మంత్రి తెలిపారు. తక్షణమే స్పందించిన పోలీసులు దిల్లీ పోలీసుల సాయంతో ఆ యువతిని రక్షించారన్నారు.

ఇంకా ఆమోదం పొందకపోయినా దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల వాళ్లు ఏపీని సంప్రదిస్తున్నట్లు తెలిపారు. కేవలం ప్రభుత్వాన్ని అవమానపరిచేందుకే తెదేపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం 42 రోజుల్లో ఈ తరహా కేసుల్లో విచారణ పూర్తి చేస్తున్నామని, కేవలం వారం రోజుల్లో పోలీసులు చార్జిషీటు వేస్తున్నాjని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ.. Protest: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో తాత్కాలిక ఉద్యోగుల సమ్మె

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.