ETV Bharat / city

ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఆన్​లైన్​ శిక్షణ ప్రారంభం

author img

By

Published : May 7, 2021, 8:13 PM IST

ప్రాథమిక పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఆన్​లైన్ ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. భవిష్యత్తులో సీబీఎస్​ఈ విధానం అమలు కానుండగా.. విద్యార్థులకు ఆంగ్లంలో బోధించేందుకు అవసరమైన నైపుణ్యాలను ఉపాధ్యాయుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

minister adimulapu suresh
మంత్రి ఆదిమూలపు సురేష్

నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 'పాఠశాల విద్య - సమగ్ర శిక్షా' కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఆన్​లైన్ ద్వారా శిక్షణను ఆయన ప్రారంభించారు. 24 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. విద్యారంగంలో ఖర్చు చేసే ప్రతి పైసా.. భవిష్యత్తుకు పెట్టుబడిలాంటిదని పేర్కొన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: వాహనంలో కూర్చునే టీకా.. ఎక్కడంటే?

విభిన్న విద్యా ప్రణాళికలను ఎస్​సీఈఆర్టీ క్షుణ్నంగా పరిశీలించి.. ఎన్నో నెలలు కష్టపడి నాణ్యమైన సిలబస్​ను, పాఠ్య పుస్తకాలను తయారు చేశారని మంత్రి తెలిపారు. రాబోయే కాలంలో ఏడో తరగతి నుంచి సీబీఎస్ఈ విధానం అమలు చేయబోతున్నామని చెప్పారు.

2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు పరీక్ష రాస్తారు కాబట్టి .. ఆంగ్లంలో బోధించేలా ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సెలవుల్లో 50 గంటల ఆన్​లైన్ శిక్షణతో కూడిన 24 లైవ్ ఉపన్యాసాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, సమగ్ర శిక్షా పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఆర్బీకేల ద్వారా కల్లాల వద్దే ధాన్యం సేకరణ: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.