ETV Bharat / city

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​కు అరుదైన గౌరవం

author img

By

Published : Jan 24, 2020, 7:53 AM IST

Updated : Jan 24, 2020, 7:34 PM IST

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​కు అరుదైన గౌరవం దక్కింది. ప్రభుత్వాధినేతలు, కేంద్ర మంత్రులు పాల్గొనే గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు కేటీఆర్ పాల్గొన్నారు.

telangana it minister ktr
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​కు అరుదైన గౌరవం దక్కింది. కీపింగ్ పేస్ టెక్నాలజీ- టెక్నాలజీ గవర్నెన్స్ ఎట్ క్రాస్ రోడ్స్ పేరుతో జరిగిన సమావేశంలో సెర్బియా, పోలాండ్, ఈస్టోనియా దేశాల ప్రధానమంత్రులతో పాటు వివిధ దేశాలకు చెందిన కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర స్థాయి ఆహ్వానితులు కేటీఆర్ మాత్రమే. ప్రపంచ నాయకులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి వివిధ అంశాలపై మాట్లాడుకునే అవకాశాన్ని ఈ సమావేశం ద్వారా వరల్డ్ ఎకనమిక్ ఫోరం కల్పిస్తుంది.

ఇవీ చూడండి:

మండలిని రాష్ట్రం ఏకపక్షంగా రద్దు చేయగలుగుతుందా?

Last Updated : Jan 24, 2020, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.