ETV Bharat / city

తెలంగాణ: 'అందుకే 139 మందిపై కేసు పెట్టా... ప్రదీప్​ అమాయకుడు'

author img

By

Published : Aug 31, 2020, 3:15 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 139 మంది అత్యాచార కేసు.. మలుపులు తిరుగుతోంది. తాజాగా.. ఆ యువతిపై 139 మంది అత్యాచారం చేయలేదని.. 30 మందే చేశారని యువతి చెప్పినట్లు ఎమ్మార్పీస్​ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వివరించారు.

mandakrishna-madiga-talk-about-139-people-attempt-rape-case
తెలంగాణ అత్యాచారం కేసు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన 139 మంది అత్యాచార కేసుపై బాధితురాలు మరికొన్ని విషయాలు తెలిపింది. డాలర్​ భాయ్​ అలియాస్​ శ్రీకర్‌రెడ్డి ఒత్తిడి వల్లే 139 మందిపై కేసు పెట్టినట్లు బాధిత యువతి పేర్కొంది. తాను తప్పుడు కేసులు పెట్టినవారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది. ఈ కేసుతో నటుడు కృష్ణుడికి, యాంకర్​ ప్రదీప్​కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. డాలర్ భాయ్‌పై ఫిర్యాదు చేస్తానని వివరించింది.

అయితే.. యువతిపై అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మార్పీస్​ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. యువతికి ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని కోరారు. 139 మందిలో 30 మంది అత్యాచారం చేశారని యువతి చెప్పారని మందకృష్ణ తెలిపారు. మిగితా వారు వేధింపులకు గురిచేశారని యువతి చెప్పిందని స్పష్టం చేశారు.

ఫిర్యాదులో పేర్కొన్న కొందరితో యువతికి సంబంధం లేదని తెలిసిందని మందకృష్ణ వివరించారు. డాలర్‌ భాయ్ అలియాస్ రాజా శ్రీకర్‌రెడ్డి యువతితో కేసులు పెట్టించాడని అన్నారు. యువతిని అత్యాచారం చేసేందుకు శ్రీకర్‌రెడ్డి యత్నించారని చెప్పారు. టీవీ యాంకర్‌ ప్రదీప్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని మందకృష్ణ తెలిపారు.

ఇవీ చూడండి:

'మేటి కొప్పాక'.. మనసు దోచే కొండపల్లి బొమ్మల వైభవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.