ETV Bharat / city

బొగతలో యువకుడు గల్లంతు... గాలింపు చర్యలు ముమ్మరం

author img

By

Published : Aug 31, 2020, 1:18 PM IST

man-missing-in-bogatha-waterfalls
బొగతలో యువకుడు గల్లంతు

తెలంగాణ రాాష్ట్రం ములుగు జిల్లాలోని బొగత జలపాతంలో గల్లంతైన యువకుడి కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి బొగతకు వెళ్లిన యువకుడు... స్నానం చేసేందుకు జలపాతంలోకి దిగి గల్లంతయ్యాడు.

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని బొగత జలపాతంలో గల్లంతైన యువకుడి కోసం... గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. హన్మకొండకు చెందిన గోపీచంద్... ఆదివారం సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలసి బొగత జలపాత సందర్శనకు వచ్చాడు.

అందరూ స్నానం చేసేందుకు జలపాతంలోకి దిగారు. ఈ క్రమంలో గోపీచంద్ గల్లంతయ్యాడు. స్నేహితులు పోలీసులకు సమాచారమివ్వగా... గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి: వెనుకనుంచి లారీ ఢీకొన్న మరో లారీ... ఇద్దరి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.