ETV Bharat / city

Maoist Dump in AOB: ఏవోబీలో మావోయిస్టుల భారీ డంప్.. వారం వ్యవధిలోనే రెండోసారి..!

author img

By

Published : Dec 31, 2021, 6:51 PM IST

Updated : Dec 31, 2021, 7:00 PM IST

Maoist Dump in AOB
Maoist Dump in AOB

Maoist Dump in AOB: ఏవోబీలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ లభ్యమైంది. ఐఈడీ బాంబులతో సహా పెద్దసంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టుబడినట్లు మల్కన్‌గిరి పోలీసులు వెల్లడించారు. వారం వ్యవధిలోనే రెండోసారి భారీ స్థాయిలో డంప్​ స్వాధీనం కావటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు.

Maoist Dump in AOB: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాబేరు మ‌రియు అర్లింగ‌పాడు గ్రామ‌ల స‌రిహ‌ద్దుల్లో అట‌వీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. మావోయిస్టుల డంప్‌ లభించింది. ఐఈడీ బాంబులతో సహా పెద్దసంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టుబడినట్లు మల్కన్‌గిరి పోలీసులు వెల్లడించారు.

ఏవోబీలో మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

అక్రమ ఆయుధాల తయారీ, భారీ బాంబులు, మందుపాత‌ర‌ల‌ను మావోయిస్టులు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆరు ఐఈడీ టిఫిన్‌ బాంబులు, రెండు ప్రెష‌ర్ ఐఈడీలు, కోడెక్స్ వైర్, 7.62 బాల్ ఆమ్యునేష‌న్‌లు రెండు, ఒక ఇన్సాస్ మ్యాగ‌జైన్‌, ఒక ఐఈడీ మెకానిజంతోపాటు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఆయుధాలు తయారీతో పాటు మరమ్మతులు చేసేందుకు ఈ డంప్​ను మావోయిస్టులు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నెల 25న భారీ డంప్ పట్టివేత..
Maoist Dump Seized : ఈనెల 25వ తేదీన ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన ఓ భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జొడొంబో పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని క‌టాఫ్ ఏరియా ప్రాంతంలో.. ఒడిశా మ‌ల్క‌న్‌గిరి పోలీసులు ఇంటెన్సివ్ సెర్చ్, ఏరియా డామినేష‌న్ నిర్వ‌హించగా భారీ డంప్ బయటపడింది. ఇందులో పేలుడు సామగ్రి, యంత్రాలు ఉన్నాయి.

ఈ డంప్‌లో ఒక జనరేటర్, కోడెక్స్ తీగ, ఆరు ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఎలక్ట్రిక్ తీగలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కోడెక్స్ వైర్ బ్లాస్టింగ్ శ‌క్తిని పెంచుతుంద‌న్నారు. ఈ డంప్ ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీ క్యాడ‌ర్‌కు చెందిన‌విగా అనుమానిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ వారం రోజుల్లోనే భారీ స్థాయిలో డంప్​లు బయటపడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇదీ చదవండి :

Somu On Liquor Prices: రూ.50 కే చీప్ లిక్కర్ అమ్మితే కుటుంబానికి రూ.2 లక్షలు మిగులుతాయి: సోము

Last Updated :Dec 31, 2021, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.