ETV Bharat / city

KRMB: నాగార్జున సాగర్​లో.. కేఆర్​ఎంబీ సబ్​ కమిటీ పర్యటన

author img

By

Published : Nov 15, 2021, 4:10 PM IST

Updated : Nov 15, 2021, 5:13 PM IST

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కేఆర్‌ఎంబీ(KRMB news) ఉపసంఘం సభ్యులు పర్యటిస్తున్నారు. నాగార్జున సాగర్(Nagarjuna Sagar Project) చేరుకున్న సభ్యులు... జలాశయం, విద్యుదుత్పత్తి కేంద్రం పరిశీలిస్తున్నారు. ఉపసంఘం.. ఇవాళ, రేపు నాగార్జునసాగర్‌లో(KRMB Sub committee at nagarjuna sagar) పర్యటించనుంది.

KRMB sub committee at nagarjuna Sagar
నాగార్జున సాగర్​లో.. కేఆర్​ఎంబీ సబ్​ కమిటీ పర్యటన

కేఆర్‌ఎంబీ(KRMB sub committee sagar visit) ఉపసంఘం సభ్యులు.. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. పెద్దఅడిశర్లపల్లి మండలం పుట్టంగండి రిజర్వాయర్​ను సభ్యులు పరిశీలించారు. నాగార్జునసాగర్ చేరుకున్న కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ సభ్యులు... సాగర్‌ జలాశయం, విద్యుదుత్పత్తి కేంద్రం పరిశీలించనున్నారు. సాగర్‌ కుడి కాలువ వివరాలపై ఆరా తీయనున్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకునేందుకు కృష్ణా బోర్డు (Krishna River Management Board) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత నెలలో జరిగిన బోర్డు (Krishna River Management Board news) సమావేశంలో అప్పగించేందుకు గుర్తించిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో కంపోనెంట్లను క్షేత్రస్థాయిలో సందర్శించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ, రేపు ఉపసంఘం (KRMB Subcommittee news) నాగార్జునసాగర్‌లో పర్యటించనుంది.

క్షేత్రస్థాయిలో పరిశీలన

రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలోని కంపోనెంట్లను పరిశీలించి రెండోరోజు మధ్యాహ్నం రెండు రాష్ట్రాల సభ్యులతో ఉపసంఘం (KRMB Subcommittee inspected sagar project) సాగర్‌లో సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు బోర్డు (Krishna River Management Board) ఓ ప్రకటనను ఇదివరకే విడుదల చేసింది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్ లెట్లను పరిశీలించిన ఉప సంఘం... సోమవారం ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పంప్ హౌస్, సాగర్ స్పిల్ వే, స్లూయిస్, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్లను పరిశీలించనుంది. మంగళవారం సాగర్ ఎడమ కాల్వ పవర్ హౌస్, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్, వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్‌లను పరిశీలిస్తారు. అదే రోజు మధ్యాహ్నం సాగర్‌లో ఉపసంఘం (KRMB Subcommittee) సమావేశం జరగనుంది.

పోలవరంపై కేంద్రం సమీక్ష ఎప్పుడు?

ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన, సత్వర సాగునీటి ప్రయోజన పథకం, ఆయకట్టు అభివృద్ధి-నీటి నిర్వహణ కార్యక్రమం పథకాల కింద రూ.500 కోట్లకు పైగా నిధులతో ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఈనెల 23న దిల్లీలో కేంద్రం సమీక్ష నిర్వహించనుంది. శ్రమశక్తి భవన్‌లో ఏర్పాటు చేయనున్న ఈ సమావేశంలో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పనులపై చర్చించనున్నట్లు గురువారం జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర జల్​శక్తి జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా కేఆర్ఎంబీకి స్వాధీనం చేసేందుకు గుర్తించిన అవుట్​లెట్లను సబ్​కమిటీ పరిశీలించనుంది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్​లెట్లను పరిశీలించిన ఉపసంఘం.. తాజాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై నేతృత్వంలోని సబ్​కమిటీ నాగార్జున సాగర్​లో పర్యటిస్తోంది.

సబ్ కమిటీని కలిసిన ఏపీ సాగు సంఘాల సమాఖ్య

కేఆర్​ఎంబీ సబ్ కమిటీ సాగర్​ పర్యటన సందర్భంగా... ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కలిసింది. ఏపీ నీటి హక్కులు కాపాడాలని సాగు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గోపాలకృష్ణారావు కోరారు. కృష్ణా నదిపై తెలంగాణ నిర్మించే అక్రమ పాజెక్టులు ఆపాలని విన్నవించారు. అనంతరం సాగు కుడి కాల్వ రైతుల సమస్యలపై కమిటీ(AP Federation of Irrigation Associations Meet KRMB sub-committee at sagar)కి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి..

Last Updated : Nov 15, 2021, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.