ETV Bharat / city

'భవానీ దీక్ష భక్తులు ఆన్ లైన్ టిక్కెట్లు పొందాలి'

author img

By

Published : Nov 28, 2020, 5:23 PM IST

భవానీ దీక్ష విరమణ కోసం వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లో టిక్కెట్లు పొందాలని ఇంద్రకీలాద్రి పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు వెల్లడించారు. టిక్కెట్ల కోసం ఆన్ లైన్ వైబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు.

_Durgagudi_
_Durgagudi_

విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భవానీ దీక్ష విరమణ చేసే భక్తులు ముందస్తుగా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పొందాలని పాలమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు తెలిపారు. రోజుకు 10 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు. ఇందులో వంద రూపాయల టిక్కెట్లు వెయ్యి కాగా.. మిగిలిన 9 వేలు ఉచిత టిక్కెట్లును అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.

టిక్కెట్ల కోసం ఆన్‌లైన్‌ సైట్‌ను ప్రారంభించామని.. దీక్ష విరమణలు జనవరి 5 నుంచి 9 వరకు ఉంటాయని చెప్పారు. అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ఆన్ లైన్ టోకెన్ తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా గిరి ప్రదక్షిణతో పాటు కేశ ఖండన నిలిపివేశామన్నారు. నదీ స్నానాలు, జల్లు స్నానాలు నిషేధించామని చెప్పారు.

ఇదీ చదవండి:

రాష్ట్రస్థాయి పదవి ఉన్నా.. నిలువ నీడ లేదు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.