ETV Bharat / city

'అక్షరాస్యతలో వెనకబడ్డ పేదదేశం మనది'

author img

By

Published : Jan 9, 2020, 2:08 PM IST

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించే దిశగా ఇండియన్​ డెమోక్రసీ ఎట్​ వర్క్​ పనిచేస్తుందని జయప్రకాశ్​ నారాయణ అన్నారు. ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​లో రాజకీయాల్లో ధన ప్రవాహం అనే అంశంపై జరుగుతున్న సదస్సులో ఆయన ప్రసంగించారు.

jayapraksah narayana  on democray at work meeting in indian school of business
ప్రజాస్వామ్యంపై జయప్రకాశ్​ నారాయణ

ప్రపంచంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం భారత్​ అని లోక్​సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. రాజకీయాల్లో ధన ప్రవాహంపై ఇండియన్​ స్కూల్​ ఆఫ్ బిజినెస్​, హెచ్​సీయూ, ఇండియన్​ డెమోక్రసీ ఎట్​ వర్క్​ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అక్షరాస్యతలో వెనుకబడ్డ పేదదేశం మనదని పేర్కొన్నారు. జనాభాలో, విస్తీర్ణంలో గత రెండువేల సంవత్సరాలుగా ప్రజాస్వామ్య అనుభవం లేదని పేర్కొన్నారు. ఇండియన్ డెమోక్రసీ ఎట్​ వర్క్​ ద్వారా ప్రతి సంవత్సరం జాతీయ సదస్సులు నిర్వహించి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. రాజకీయాల్లో ధన ప్రవాహంపై జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

ప్రజాస్వామ్యంపై జయప్రకాశ్​ నారాయణ

ఇవీచూడండి:ఓట్ల కొనుగోలు, డబ్బు పంపకం.. పరిపాటిగా మారింది: ఉపరాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.