ETV Bharat / city

కరవు భత్యం చెల్లింపులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

author img

By

Published : Nov 7, 2020, 4:44 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం చెల్లింపులపై కరోనా ప్రభావం పడింది. కరవు భత్యం చెల్లింపులను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్​ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.

Issued orders suspending drought allowance payments
కరవు భత్యం చెల్లింపులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

కొవిడ్-19 కారణంగా... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం చెల్లింపులను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భత్యాన్ని నిలుపుదల చేసింది. 2021 జూన్ 30వ తేదీ వరకు చెల్లింపులు నిలిపి వేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్​ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల 2018-19కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరవు భత్యం బకాయిలు చెల్లింపునకు ఇబ్బందులు ఉండవని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

ఇదీ చదవండీ... అప్పు తీర్చలేదని తండ్రీ కొడుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.