ETV Bharat / city

వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్​ పనులు రెండు నెలల్లో పూర్తి చేయాలి: మంత్రి అనిల్​

author img

By

Published : Nov 6, 2020, 4:41 PM IST

వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్​లో మిగిలిన పనులను నెలాఖరు నాటికి పూర్తి చేయాలని మంత్రి అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనుల పురోగతి పై సమీక్షించిన ఆయన... పలు అంశాలపై సూచనలు చేశారు.

Irrigation_Minister_
Irrigation_Minister_

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. వెలిగొండ టన్నెల్ పనులకు సంబంధించిన అంశాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్​లో మిగిలిన పనుల్ని నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 43.5 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కీలకమైన ఈ టన్నెల్ పనులు త్వరితగతిన పూర్తి కావాల్సి ఉందని స్పష్టం చేశారు. టన్నెల్ తవ్వకానికి సంబంధించి ఇంకా 250 మీటర్ల సొరంగం తవ్వకం పనులు మిగిలి ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తవ్వకం పనులు పూర్తి అయ్యాక టన్నెల్ బోరింగ్ మిషన్​ను తొలగించేందుకు మరో నెల రోజులు పాటు పట్టే అవకాశమున్నట్టుగా అధికారులు తెలిపారు. రెండు నెలల్లో సొరంగం పనుల్ని పూర్తి చేయాలని సూచించారు.

ఇదీ చదవండి

తమిళకూలీల మృతికి కారణమైన స్మగ్లర్‌ బాషాభాయ్‌ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.