ETV Bharat / city

డ్వాక్రా సంఘాల ఖాతాల్లో నేడు వడ్డీ రాయితీ జమ

author img

By

Published : Apr 23, 2021, 6:50 AM IST

నేడు డ్వాక్రా సంఘాల ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ కానుంది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,109 కోట్లు సీఎం జగన్​ జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా కోటి మంది మహిళలు లబ్ధి పొందనున్నారు.

Dwakra communities
డ్వాక్రా సంఘాల సభ్యులు

రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో 'వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం' కింద రూ.1,109 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం జమ చేయనుంది. వరుసగా రెండో ఏడాది ఈ పథకం కింద నగదును జమ చేస్తోంది. మొత్తం 9.35 లక్షల సంఘాల్లోని 1.02 కోట్ల మంది మహిళల ఖాతాల్లో ఈ మొత్తాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మీట నొక్కి ముఖ్యమంత్రి జగన్‌ జమ చేస్తారు.

2020-21 ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.862.87 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.246.15 కోట్ల మేర వడ్డీ రాయితీని చెల్లించనున్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలకు క్రమం తప్పకుండా నెలవారీ వాయిదాలు చెల్లించిన వారికి ఈ వడ్డీ రాయితీని వర్తింపజేస్తారు. ఒకవేళ సంఘం రుణ ఖాతా ఇప్పటికే మూసివేసినట్లయితే సంఘం పొదుపు ఖాతాలో జమ చేస్తారు. గతేడాది ఈ పథకం కింద అర్హత కలిగిన డ్వాక్రా సంఘాల సంఖ్య 8.71 లక్షలు ఉండగా ఈ ఏడాది 9.35 లక్షలకు పెరగడం గమనార్హం.

ఇదీ చదవండి: ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సన్నద్ధంగా ఉన్నాం : బూసిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.